జగన్ని జైల్లో పెట్టే దమ్ము నరేంద్ర మోడీకి లేదు

ఈరోజు రాజమండ్రి లో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ప్రశ్నకు సమాధానంగా జగన్ కేంద్రంపై తిరుగుబాటు చేస్తే జగన్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే దమ్ముందా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేదని తెలిపారు. ఆయన మాటల్లో జగన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల లో అత్యంత పలుకుబడి ప్రజా మద్దతు కలిగిన నాయకుడు కాబట్టి కేంద్రం ఆ సాహసం చేయదు అని చెప్పారు.

మోడీ జగన్ మధ్య జరిగిన మీటింగ్ గురించి మాట్లాడుతూ జగన్ నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ కి నిధులు ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, పోలవరం త్వరితగతిన పూర్తయ్యేలా సహకరించండి లేకుంటే నా బెయిల్ రద్దు చేసి నన్ను జైల్లో పెట్టండి అని కేంద్రాన్ని నిలదీసే తప్ప కేంద్రం దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి సహాయం అందదని తెలిపారు.

జగన్ ప్రధాని దగ్గర తన బెయిల్ విషయం ప్రస్తావించి ఉంటారా అన్న ప్రశ్నకు అరుణ్ కుమార్ సమాధానం చెబుతూ ప్రధాని ఒక 30 నిమిషాలు సమయం కేటాయించి ఉంటే ఒక ఐదు నిమిషాలు తన గురించి మాట్లాడి మిగతా సమయం రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడి ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అలాకాకుండా జగన్ మొత్తంగా తన బెయిల్ విషయమై మాట్లాడి ఉంటే అది రాష్ట్రానికి ముఖ్యమంత్రి కి ఇద్దరికీ నష్టం చేకూరుస్తుందని చెప్పారు