మనం గమనించం గాని చంద్రబాబు నాయుడుగారు మంచి కామెడీ చేస్తారు. ఆయన కామెడీకి వచ్చిన బిరుదులే ‘అపర చాణిక్యుడు ధీరుడు సూరుడు అప్పట్లో కేంద్రాన్నే గింగరాలు తిప్పి పక్కన పడేసిన రింగు మాస్టర్’.. ఇలా చెప్పుకుంటే బాబుగారి గతం పెద్ద బాగోతమే. ఇక నేడు కూడా బాబుగారు మంచి కామెడీని పండించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమట. తెలుగుదేశం పార్టీని ఎవరూ కదిలించలేరట. మరి గత ఎన్నికల్లో చేసింది ఏమిటో ? ఓ.. కదిలించలేదు కదా.. జస్ట్ పీకి పడేశారు అంతే!
అన్నట్టు టీడీపీ ఎవరికీ భయపడబోదట, నిజమే కాకాపోతే చంద్రబాబునే భయపడుతుంటాడు. సవాళ్లు టీడీపీకి కొత్త కాదట, గతంలోనూ టీడీపీ అనేక సవాళ్ళు ఎదుర్కొందట, బాబు ఎప్పుడూ గతంలో ఉంటార్లేండి. గతంలో తెలుగుదేశం పార్టీ పై బురదజల్లిన వారు, అదే బురదలో కూరుకుపోయారట. కూరుకుపోయారో.. లేక బాబుగారే కూరుకుపోయేలా చేశారో..! ఇక వైసీపీ నేతల బెదిరింపులకు ఎవరూ భయపడబోరని, వైసీపీ వల్లే హత్యా రాజకీయాలు చేయడం తమకు అలవాటు లేదని బాబుగారు చెప్పారు. నిజమే బాబుగారు చేసేది ఓన్లీ వెన్నుపోటు రాజకీయాలే. పైగా వాడుకుని వదిలేయడం తప్ప బాబుగారు ఇంకేం చెయ్యరు.
మొత్తానికి టీడీపీ తిరిగి ఖచ్చితంగా అధికారంలోకి వస్తోందని బాబు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. పనిలో పనిగా ఎన్టీఆర్ గురించి కూడా రెండు మంచి మాటలు చెప్పారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ కు ఎవరూ సాటిలేరని, పేదల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పుకొచ్చాడు. మరి ఎన్టీఆర్ ను సీఎంగా ఎందుకు దించేశారు ? అదేవిధంగా ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మాట బాబు అనడానికి బాబుకు కనీసం సిగ్గు కూడా లేదు అంటే… బాబుది ఎంత హేయమైన బతుకో అర్ధమవుతుంది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి అంత అయిపోయాక ఇప్పుడు తీరిగ్గా డిమాండ్ చేస్తున్నాడట.