ఛీ.. ‘బాబు’ ఇక మారడు !

 
ఎప్పుడూ గెలిచేవాడికంటే.. ఓడిపోయి గెలిచినవాడికే  ఆ గెలుపు యొక్క లోటుపాట్లు పై  ఎక్కువ అవగాహన ఉంటుందనేది ఓ నానుడి, కానీ బాబు విషయంలో మాత్రం ఈ నానుడి నిజం కాదనిపిస్తోంది.  ఇక ఆయనగారి రాజకీయాల విషయానికి వస్తే  ఈ గెలుపు ఓటమి అనేవి  వచ్చేపోయే పగలు రాత్రి లాంటివి..  అని ఎంత సర్దిచెప్పుకున్నా తెలుగు తమ్ముళ్ల బాధ మాత్రం పొవట్లేదట. నిజానికి బాబుగారికి ఓటమి కొత్త కాదు. అయితే గత సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాత్రం బాబు పార్టీకి అత్యంత అవమాన కరమైన ఓటమి వచ్చింది. ఇంత‌టి ఘోర  ప‌రాభావం దెబ్బతో..  మళ్ళీ  తెదేపా  అధికారంలోకి రావాలంటే అసాధ్యమే అంటున్నారు.  అయినా, మళ్లీ సీఎం అవ్వటానికి బాబు, జగన్ పై తన ఎత్తులు కుయుక్తులతో బురద జల్లే ప్రయత్నం  చేస్తూనే ఉన్నారు.
 
తాజాగా  మహానాడులో  జగన్‌ ను  విమర్శిస్తూ..   జగన్ పాలనంతా భూకబ్జాలు, అవినీతిమయమని అన్నారు. మరి బాబుగారి పాలన నీతివంతమైనది అయితే ఎందుకు ప్రజలు ఆయన్ను ఇంట్లో కూర్చోపెట్టారు ? పులివెందుల నుంచి వచ్చిన కొంతమంది వైజాగ్ లో దౌర్జన్యం చేశారట. ఈ విషయం వైజాగ్ వాళ్లకు తెలియదా,  రెండు నెలలు తరువాత ఏపీకి వెళ్లిన బాబుగారికి మాత్రమే తెలుసా.  అన్నట్టు  కాకినాడ మడ అడవులు, ఇంకొకవైపు ఆవ, రాజమండ్రి భూములు, గుడివాడలో ప్రైవేటు భూములు  ఇచ్చేయాలని  ఓ మంత్రి బలవంతం చేస్తున్నాడట. అలాగే సింహాచలంలో భూముల కబ్జా చేశారని, శ్రీశైలం, కనకదుర్గమ్మ గుడిలో అవినీతి జరిగిందని, ఎక్కడ చూసినా అవినీతేనని బాబు మిక్కిలి కుమిలిపోతున్నారు.
 
 
జగన్ ప్రభుత్వం తప్పు చేస్తూ, కప్పి పుచ్చుకోడానికి ఎదురుదాడి చేస్తుందని బాబు విమర్శించారు. బిల్డ్ ఏపీ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ను అమ్మేయడం… ఈ అరాచకమేంటని బాబు ప్రశ్నిస్తూ  ప్రభుత్వం ఆస్తులు అమ్మే అధికారం ఎవరిచ్చారని బాబు నిలదీశారు. బాబు మాటలు వింటుంటే  బాబును ఏమనాలో ఎవ్వరికి అర్థం కావడం లేదు. దెయ్యాలు వేదాలు చెప్పడం అంటే ఇదేనేమో. ఏమైనా  ఈ ‘బాబు’ ఇక మారడు !