చంద్రబాబునాయుడు మాటలు వింటుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం విస్తరిస్తోందన్నారు. పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు మండిపడ్డారు. ఫ్యాక్షనిజానికి, జగన్ పాలనపై వ్యతిరేకంగా కార్యాచరణను కూడా ప్రకటించటమే విచిత్రంగా ఉంది.
వైసిపి ప్రభుత్వం అరాచకాలపై, ఫ్యాక్షనిజంపై మొదట డిజిపిని కలుస్తారట. తర్వాత గవర్నర్ కు మెమొరాండం సమర్పించాలని చెప్పారు. తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రిని కూడా కలిసి రాష్ట్రంలో పరిస్ధితిని వివరిస్తారట. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తారట.
చంద్రబాబు చెప్పిన విషయాలు వింటుంటే చాలా విచిత్రంగా ఉంది. జగన్ సిఎం అయిన తర్వాత ఎక్కడా ప్రత్యేకించి ఫ్యాక్షన్ హత్యలేమీ జరగలేదు. ఇప్పటి వరకూ జరిగిన గొడవలు కూడా రెండు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య ఉన్న వ్యక్తిగత గొడవలే కారణం. తాజాగా జరిగిన చలో ఆత్మకూరు రచ్చ కూడా ఇందులో భాగమే.
ఆత్మకూరు గ్రామంలో మామా, అల్లుళ్ళ కుటుంబాల మధ్య మొదలైన తగాదాలను చంద్రబాబు సొంత ప్రచారానికి వాడుకుని దాదాపు పది రోజులు కంపు చేసేశారు. జగన్ ప్రభుత్వాన్ని గబ్బు పట్టించటమే ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. అందుకనే ఆత్మకూరు గ్రామంలో మామూలు జనాలు చంద్రబాబు పిలుపును ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. ఇలాంటి నేపధ్యంలోనే మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలంటూ చంద్రబాబు కంపు మొదలుపెట్టారు.