చంద్రబాబుకి.. జగన్‌కి తేడా ఇదే..?

సీఎం జగన్ ‌మరోసారి బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సాధారణ ఎన్నికల్లో తనకు పూర్తి మద్దతు ఇచ్చిన బీసీలకు లోక్ సభ బరిలో, తాజాగా స్థానిక ఎన్నికల్లో కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభ సీట్ల విషయంలోనూ బీసీ నేతలకు 50 శాతం సీట్లు ఇచ్చి బీసీల పట్ల చిత్తశుద్ధిని చాటుకున్నారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి బీసీలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయాన్ని బలంగా ఆ సామాజిక వర్గంలోకి తీసుకెళ్తున్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు కోర్టు రూపంలో సమస్యలు ఎదురైనా సరే పార్టీ తరపున సీట్లు కేటాయించి మొత్తం 34 శాతం సీట్లను బీసీలకు కేటాయించారు. అలాగే రాజ్యసభ సీట్ల కేటాయింపు చూస్తే.. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపీదేవి వెంకట రమణకు సీట్లను కేటాయించారు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. అయితే ఎమ్మల్సీని చేసి మరీ మోపీదేవికి, ఎమ్మెల్సీగా ఉన్న పిల్లి సుబాష్ చంద్రబోసుకు మంత్రి పదవులిచ్చారు. మండలి రద్దు అవుతున్న తరుణలో ఏకంగా వారిద్దరినీ రాజ్యసభకు పంపుతున్నారు.

అలాగే పార్టీ కోసం సీటును సైతం త్యాగం చేసిన అయోధ్యరెడ్డిని సైతం రాజ్యసభకు పంపుతున్నారు జగన్. దీన్ని చూస్తేనే చంద్రబాబుకు, జగన్ ‌కు మధ్య ఉన్న తేడా అర్థమవుతోంది. చంద్రబాబు హయాంలో రాజ్యసభ సీట్ల కేటాయింపులు చూస్తే.. బడా వ్యాపారవేత్తలకే తప్ప పార్టీని నమ్ముకున్న వారికి ఏ మాత్రం ప్రాధాన్యత లేదన్నది స్పష్టంగానే కనిపిస్తోంది. సీనియర్లు ఎంతలా కోరినా సరే చంద్రబాబు వారిని పట్టించుకుని, రాజ్యసభ సీట్లను కేటాయించి లేదని ఆ పార్టీ సీనియర్లే బాధను వ్యక్తం చేసేవారు. అయితే ఇప్పుటి వైసీపీ ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పార్టీని నమ్ముకున్న వారికి, మాట ఇచ్చిన మేరకు జగన్ పదవులు ఇస్తున్నారు.

మొత్తంగా రాజ్యసభ సీట్ల కేటాయింపుతో బీసీలలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీని నమ్ముకున్న వారిలో కూడా జగన్ తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబుపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.