గ్రామ సచివాలయ ఉద్యోగులకు నిజమైన దసరా

గ్రామ, వార్డు సచివాలయాలకు ఎంపికైన ఉద్యోగులకు ఈ దసరా పండుగ నిజంగానే పండగ తెచ్చినట్లే అనుకోవాలి. ఎందుకంటే దసరా పండుగ మొదలవుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నియామక ఉత్తర్వులను అందచేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన వారికి జగన్ నియామక లెటర్లు ఇవ్వనున్నారు. అంటే దసరా పండుగ సందర్భంలో ఉద్యోగాల్లో చేరటం కన్నా నిరుద్యోగులకు కావాల్సిందేముంటుంది ?

అందుకే నియామకపు ఉత్తర్వులను అందుకోవాల్సిన వారందిరినీ ప్రభుత్వం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ కు రావాల్సిందిగా సమాచారం అందించింది. సుమారు 2 లక్షల మంది పండుగ సందర్భంగా ఉద్యోగులుగా మారబోతున్నారు. ఒకవైపు గ్రామ సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన వారు మంచి జోష్ మీదుంటే అదే సమయంలో ఎల్లోమీడియా, చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లుతుండటం ఆశ్చర్యంగా ఉంది.

ఎలాగైనా గ్రామ సచివాలయం వ్యవస్ధను గబ్బు పట్టించమే టార్గెట్ గా చంద్రబాబు, ఎల్లోమీడియా ఓ వ్యూహం ప్రకారం వ్యవహారాలను నడుపుతున్నారు. అందుకనే ఎల్లోమీడియాలో వచ్చిన కథనాలనే చంద్రబాబు అండ్ కో ఓ టైం టేబుల్ ప్రకారం ఆరోపణలు, విమర్శలతో హోరెత్తించేస్తున్నారు. లేకపోతే చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఎల్లోమీడియా విస్తృత ప్రచారం ఇస్తోంది.

గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగుల వ్యవస్ధలు గనుక బలోపేతమైతే చంద్రబాబుకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ విషయం స్పష్టంగా తెలుసు కాబట్టే ఎలాగైనా వ్యవస్ధలపై జనాల్లో చెడు అభిప్రాయం కలిగించటం కోసం నానా అవస్తలు పడుతున్నారు. సరే వీళ్ళెంత ప్రయత్నాలు చేస్తున్నా జగన్ మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్లే చేసుకుపోతున్నారు లేండి.