రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణరాజు వైఖరి యువజన రైతు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. పార్టీలో ఉంటూనే ప్రభుత్వ విధానాల మీద, వైఎస్ జగన్ పాలన మీద ప్రశ్నలు సంధిస్తూ సంచలనం రేపుతున్నారు. రాఘురామరాజు లేవనెత్తే ప్రశ్నలు అన్నీ సబబుగానే ఉండటంతో వైకాపా అధిష్టానానికి సమాధానం ఇవ్వడం తప్ప వేరే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికే ఇసుక, ఇళ్ల స్థలాలు వంటి పలు అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడిన రఘురామరాజు తాజాగా ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో ప్రశ్నలు లెవనెత్తుతున్నారు.
తాజాగా వైఎస్సార్ పెన్షన్ కానుక స్కీమ్ మీద మాట్లాడిన ఆయన ప్రతి సంవత్సరం పెన్షన్ రూ. 250 పెంచుతామని జగన్ ఇచ్చిన వాగ్దానాన్ని ఉటంకిస్తూ 2019 మే 30న పెన్షన్ పెంచుతామని, వయసు పరిమితిని 65 నుండి 60 కి తగ్గిస్తామనిజీవో ద్వారా ప్రకటించారు. కాబట్టి అది జూన్ నుండి అమలులోకి రావాలి. కానీ అది ఫిబ్రవరి 2020 నుండి అమలులోకి వచ్చింది. ఫలితంగా అవ్వా తాతలు ఒక్కొక్కరు పొందాల్సిన లబ్దిలో రూ. 15,750 కోల్పోయారు. కాబట్టి మీరిచ్చిన ఉత్తర్వుల మేరకు అర్హులైన అవ్వా తాతలు అందరికీ కోల్పోయిన రూమ్15,750 చెల్లించేలా అధికారులను ఆదేశించాలి.
అలాగే వైఎస్సార్ పుట్టినరోజైన జూలై 8 నుండి పెన్షన్ ను రూ.2250 నుండి 2500 కి పెంచి ఆగష్టు 1 నుండి దాన్ని అమలులోకి తెచ్చి అవ్వా తాతల ఆశలను నెరవేర్చాలి. ఈ రకంగా ఈసారి వైఎస్సార్ 71వ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ లౌక్యంగా డిమాండ్ చేశారు. ఏమాత్రం ఆక్షెపించడానికి వీలు లేని ఈ డిమాండ్ పట్ల వైకాపా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నట్టు లాజిక్స్ మాట్లాడారు రఘురామరాజు. మరి ఈ లేఖపై అధిష్టానం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.
Raghuramkrishana Raju writes another letter to YS Jagan