కేసీఆర్ బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు

కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలే కాదు.. పేదల కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తున్నారో చూస్తే.. ప్రజల ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అనాల్సిందే.

కరోనా క‌ట్ట‌డికి సీఎం కేసీఆర్ మొదటి నుండి ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా.. నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేపట్టడంతోపాటు.. లాక్‌డౌన్‌ సక్రమంగా అమలయ్యేలా కఠినంగా వ్యవహిస్తున్నారు. అదే సమయంలో ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను తొల‌గించేందుకు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే పేదలకు రూ.1500 వారి ఖాతాల్లోకి ఇవ్వడం, రేషన్ సరుకుల పంపిణీ చేసిన కేసీఆర్.. మార్చ్, ఏప్రిల్, మే నెలలకు గానూ ఎవరూ ఇంటి అద్దెలు వసూలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. నోటి మాట కాదు.. ఇప్పుడు జీవో కూడా విడుదల చేశారు.

ఈ మేరకు మూడు నెలల తర్వాత అద్దె బకాయిలను వ‌డ్డీ లేకుండా, వాయిదాల పద్ధతిలో వసూలు చేసుకోవాలని ఇంటి యజమానులకు సూచనలు చేసింది ప్రభుత్వం. అలా కాకుండా బలవంతంగా అద్దెలు వసూలు చేసినా, ఇల్లు ఖాళీ చేయించినట్లు ఫిర్యాదులు వచ్చినా శిక్షలు విధిస్తామని హెచ్చరికలు కూడా చేసింది.

కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు అన్ని రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సహా మరికొన్ని రాష్ట్రాలు ఈ మేరకు కేసీఆర్ బాటలోనే జీవోలు తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కేసీఆర్ బాటలో మరి కొన్ని రాష్ట్రాలు పేదల అద్దె కష్టాలు తీర్చేందుకు సిద్ధమవుతున్నాయి. మరి కేసీఆర్ అంటే అంతే..!