కేసీఆర్ కి కోపం వస్తే..  అంతే మరి !

కేసీఆర్ అంతే.. కోపం వస్తే  అవతల వైపు ఎవరు ఉన్నారు అని చూడడు. తాజాగా కేబినేట్ సమావేశంలో  కేంద్ర  ప్ర‌భుత్వం పై  విరుచుకుప‌డ్డారు. ఆ  20 లక్షల కోట్లతో  ఏ ఉపయోగం లేదని,  విద్యుత్ సంస్కరణల విషయంలో ఏ విధానాలు అయితే వద్దు అనుకున్నామో వాటినే అమలు చేస్తున్నారని..  ఇంత క‌ష్ట‌కాలంలో కూడా కేంద్ర ప్ర‌భుత్వం చాలా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని  కేసీఆర్  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
 
మరి కేసీఆర్ చెప్పినట్లు కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీ అంతా ప‌చ్చిమోసమా ?  ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌కు కేంద్రం విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తోందా ? మోదీ  తీరు కొత్త కాదు కదా..
ఆయన  వైఖ‌రి ఎప్పుడూ  పూర్తిగా ఖండించే విధంగానే ఉంటుంది.  అయినా ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాలు  రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలకు దిగడం సమంజసం అనిపించుకోజాలదు. 
 
 ఒకవేళ కేసీఆర్ వాదనలో నిజం ఉందని ఆయన నమ్మితే  ఎలాంటి పరిస్థితిలో కూడా కేంద్రం షరతులకు తలోగ్గకుండా ఉండాలి,, తమ హక్కల కోసం రాజ్యాంగం ఉంది కదా..  ముఖ్యమంత్రి పదవిలో ఉండి త్వరపడి విమర్శలు చేయడం స్థాయిని తగ్గించుకున్నట్లే అవుతుందని కేసీఆర్ కి తెలియనిది కాదు. అయితే ఎఫ్ఆర్బీఎంలో రుణ పరిమితిని పెంచడానికి షరతులు విధించడం పై  అసహనం వ్యక్తం చేయడంలో ఎలాంటి తప్పులేదనుకోవాలి.
 
ఏమైనా మోదీ నిర్ణయాలు ఒక్కోసారి ఇబ్బందులకు గురి చేస్తాయి. పైగా ప్రెస్ మీట్ కు ముందు మోదీ ఇచ్చే బిల్డప్ కి ప్రసంగం అయిపోయాక  మిగిలే ఫలితానికి ఎలాంటి పొంతన ఉండదు.  మరి ప్రజలు ఇవ్వన్నీ గమనించకుండా ఉంటారా..!