కేసీఆర్‌ దంపతులకు వేదాశ్వీరచనం !

 
కేసీఆర్‌ సర్ కి దైవభక్తి ఎక్కువ. కుదిరితే  చండీహోమం జరిపిస్తూ ఉంటారు.  కాగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ ‌ను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్న సీెం కేసీఆర్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేసీఆర్‌ దంపతులకు అర్చకులు ఘనస్వాగతం పలికారు.
 
కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీహోమం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్‌ ఉపేందర్‌ రెడ్డి చండీహోమం నిర్వహించారు. ఈ హోమంలో కేసీఆర్‌ దంపతులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తరించారు. అమ్మవారి దర్శనానంతరం పూజారులు పండితులు..   కేసీఆర్‌ దంపతులకు వేదాశ్వీరచనం చేసి తీర్థప్రసాదాలు అందించి దీవించారు.  ఆ తర్వాత హోమ నిర్వాహకులు కేసీఆర్‌కు అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.
 
ఇక పూర్ణాహుతి ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి బయల్దేరి వెళ్లారు. తన సొంత ఖర్చులతో నిర్మించనున్న ఎర్రవల్లి రైతు వేదికకు సీఎం భూమిపూజ చేశారు.  మర్కూర్‌ పంప్‌హౌస్‌ వద్ద నిర్వహించే సుదర్శనయాగం పూర్ణాహుతిలో కేసీఆర్‌ దంపతులు, త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామీ కూడా పాల్గొన్నారు.