‘కేసీఆర్’లో ఇంకా ఆ భయం ఉంది !

 

తెలంగాణ సీఎం కేసీఆర్,  ఆయన మేనల్లుడు హరీష్ రావుని ఈ మధ్య బాగానే  తమలో కలుపుకున్నట్లు కనిపిస్తోన్నా.. లోలోపల మాత్రం కాస్త దూరంగానే పెట్టారనేది బాగా వినిపిస్తోన్న టాక్.  దాంతో  హరీష్ రావు  బీజేపీ పార్టీలోకి  వెళ్తున్నాడని అప్పుడప్పుడు ఎక్కడోకచోట  గుసగుసలు వినపిస్తూనే ఉన్నాయి.  పైగా హరీష్ రావు ఒక్కడే పోకుండా  దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలను కూడా  తనతో  పాటు తీసుకోని పోనున్నాడని.. అందుకు తగ్గట్లుగా  ప్రస్తుతం అన్ని రకాలుగా  రంగం సిద్ధం చేసుకుంటున్నాడని..  ఇలా అనేక రకాలుగా రూమర్స్ వచ్చాయి.  ఈ లుకలుకలు అన్నిటికీ ఎప్పటికప్పుడూ హరీష్ రావు స్వయంగా వివరణ ఇస్తూనే ఉన్నారు. ఆ వివరణ ప్రకారం చూస్తే  హరీష్ రావు పార్టీ మారుతున్నారనే  ప్రచారం ఒట్టి అబద్దమని అవగతమవుతుంది.  మరి ప్రచారం మాత్రం ఎందుకు ఆగడంలేదో ?  అయితే ఈ ప్రచారాలు వెనుక ఉన్నది  హరీష్ రావు సన్నిహితులేనని తెరాసలో కొత్తగా వినిపిస్తోంది. 
 
 తెరాసలో హరీష్ రావుకి స్థాయికి తగ్గ విలువ లేకపోవడం  జీర్ణయించుకోలేకే..  పార్టీకి హరీష్ రావు విలువ తెలియాలనే ఆయన పార్టీ మారుతున్నట్లు లీకులు ఇస్తున్నారని..   అయితే ఈ విషయాలు అన్ని హరీష్ రావుకి తెలియకుండా  జరుగుతున్నాయని.. కేసీఆర్ పై ఎమోషనల్ గా ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలోనే ఇదంతా ప్లాన్ ప్రకారం హరీష్ రావు సన్నిహితులు ఒక ఆలోచనతోనే  చేస్తున్నారని సమాచారం. అయితే హరీష్ రావు నిజంగా బయటకు వెళ్తే.. అది తెరాసకు తీవ్రనష్టం చేకూరుస్తోందని కేసీఆర్ కి చిన్న భయం మొదలైందట. 
 
అందరి నాయకుల మాదిరి ఆవేశపడిపోయి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు హరీష్ రావు అని కేసీఆర్ కు తెలుసు. అయినా  హరీష్ రావు విషయంలో  కేసీఆర్ కాస్త టెన్షన్ పడుతున్నాడట. భవిష్యత్తులో తన కుమారుడి సీఎం పీఠానికి ఎక్కడ అడ్డుగా నిలబడతాడో అని కేసీఆర్ భయం కావొచ్చు.   ఎప్పటికైనా  కేటీఆర్,  హరీష్ రావునే పోటీ అని కేసీఆర్ లో ఇప్పటినుండే భయం ఉన్నట్లు ఉంది.