కరోనా వైరస్ కు మందు కనుక్కున్నారు !

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాధి చైనా ను కుదిపేస్తోంది. ఇప్పటికే 132 మంది ఈ వ్యాధితో మరణించారు. దాంతో పాటు మరో ఆరు వేల మందికి ఈ వ్యాధి ఉన్నట్టు నిర్దారణ అయింది. ఇప్పటికే అక్కడి చైనా ప్రభుత్వం పలు సహాయక చర్యలు చేపట్టింది. ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు ముమ్మరం చేసారు .. ఫైనల్ గా హాంకాంగ్ లో ఈ వ్యాధికి మందును కనుక్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మందు ఫైనల్ దశలో ఉందని, దీన్ని ముందుగా జంతువులపై ప్రయోగించి వచ్చే ఫలితాల ఆధారంగా మనుషులపై ప్రయోగం చేస్తారట.

అంటే దానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే కోరలు చాచిక కరోనా వైరస్ ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటుందో అని అందరు టెన్షన్ పడుతున్నారు. ఈ మందు అన్ని పరీక్షలు అయ్యి మనుషులకు వాడెవరకు రావాలంటే మరో నెల సమయం పట్టొచ్చంటూ నిపుణులు చెబుతున్నారు. ఈ లోగా ఈ వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వ్యాధికి విరుగుడు మందు అందుబాటులోకి వచ్చేదాకా ఆగాల్సిందేనని చైనా వైద్యుడు యూవీన్ క్వాక్ యుంగ్ తెలిపారు.