కరోనా కిట్ తో..   జగన్ ముందు చూపు !

ముఖ్యమంత్రిగా ‘వై ఎస్ జగన్’ తన సంచలనాత్మక నిర్ణయాలతో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాడు. ఏపీ రాజకీయ వర్గాల్లో జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం ఓ సంచలనమే. జగన్ ప్లాన్ లు.. ఆర్ధికపరమైన లావాదేవీల గురించి జగన్ కున్న అవగాహన, అలాగే కరోనా కాలంలో కూడా జగన్ పనితనం చూస్తుంటే ముచ్చట వేస్తోంది. కరోనా క్వారంటైన్ కిట్ ను ఇంటికే పంపిస్తూ జగన్ పభుత్వ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ లో ఉన్నవారికి కిట్ల పంపిణీ చేశారు. కిట్ లో మందులు శానిటైజర్, ఆక్సీమీటర్ మాస్కులు ఇస్తున్నారు. ఇక కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి తరలిస్తున్నారు.

కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు రాకుండా… వారికి కావాల్సినవాటిని వారి ఇంటికే పంపించే కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా గొప్ప విషయం. కరోనా తీవ్రత తక్కువగా ఉండి హోం క్వారంటైన్ లో ఉన్న వారికి ఈ కిట్ ను అందిస్తారు.. లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తారు. హోం క్వారంటైన్ లో ఉన్నవారు మెడిసిన్స్, ఇతర సామగ్రి కోసం బయటకు వస్తే… ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వారికి అవసరమైన వాటిని కిట్ ద్వారా అందించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు జగన్ కు అభినందించి తీరాలి.

ఒక పక్క తెలంగాణలో కేసీఆర్, కరోనా విషయంలో చేతులు ఎత్తేస్తే.. మరో పక్క జగన్ మాత్రం కరోనా విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దాంతో టీడీపీ వాళ్ళకి ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి. అందుకే జగన్ ప్రభంజనంలో తమ ఉనికిని కాపాడుకోవటానికి బాబు నానా హంగామా చేస్తున్నాడనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల వాదన. అయితే ముఖ్యంగా టీడీపీ చేస్తోన్న ప్రధాన ఆరోపణలు కూడా ఎప్పటిలాగే బాబు దిగజారుడు తనాన్ని చాటి చెబుతుండటంతో వాటికి కూడా పెద్దగా విలువ లేకుండా పోయింది.