కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు అహర్శిషలూ శ్రమిస్తుంటే.. ఆ సీరియస్ నెస్‌ను అర్థం చేసుకోలేని కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లపై తిరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి కొందరు సోషల్ మీడియాలో కరోనాపై వింతైన, ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. తాజాగా వేప చెట్టుకు నీళ్లు పోయండి అంటూ వధంతులు పుట్టిస్తున్నారు.
కరోనారై ఫేక్ వార్తలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం, పోలీస్ శాఖ హెచ్చరిస్తున్నా సరే.. ఎవరూ లెక్క చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఎవరికి తోచినట్లు వారు ప్రచారం చేస్తూనే ఉన్నారు. పైగా వీటిని గుడ్డిగా నమ్మి జనాలు కూడా పాటిస్తున్నారు. మరి తాజాగా వచ్చిన వింత ప్రచారం ఏంటి అంటే.. ఒక్క కొడుకు ఉన్న తల్లులు చెంబుతో నీటిని తీసుకెళ్లి వేప చెట్టుకు పోయాలంట. ఇలా చేస్తే కరోనా రాదట.
ఇలాంటి వధంతులు నమ్మిన చాలా మంది మంది తమకు తెలిసిన వారికి, తమ స్నేహితులకు ఇలా అందరికీ ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు సైతం హల్చల్ చేస్తున్నాయి. దీని వల్ల ఎలాంటి లాభం లేకపోగా అందరూ అలా ఒక చోటికి చేరి నీరు పోయడం లాంటి వాటితో కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు. వైద్యులు చెబుతున్నారు.