ఏపీలో నిజాముద్దీన్ భీభత్సం సృష్టిస్తోంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణ కంటే చాలా తక్కవ పాజిటివ్ కేసులు నమోదైన ఏపీలో బుధవారం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. గురువారం ఒక్కరోజే ఏకంగా 21 పాజిటివ్ కేసులు బయటపడటం ఏపీలో మారిని తాజా పరిస్థితికి అద్దంపడుతోంది. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ నిజాముద్దీన్‌కి వెళ్లి వచ్చిన వారేనని తెలుస్తోంది.
రిపబ్లిక్ టీవి ప్రసారం చేసిన ఆడియో టేప్ కలకలం సృష్టించిన నేపథ్యంలో ఏపీలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. కుట్రలో భాగంగానే ఏపీ, తెలంగాణాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయా? అని అనుమానాలు మొదలవుతున్నాయి. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ఏపీలో, తెలంగాణలొ కరోనా పాజిటివ్ కేసులు పెరగడం దేనికి సంకేతమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గురువారం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన కరోనా పాజిటివ్ కేసులతో ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 132కు చేరింది. గురువారం ఒక్కరోజే 21 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 20 చొప్పున, ప్రకాశం జిల్లాలో 17 మంది, కడప 15, కృష్ఱా జిల్లాలో 15 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది, విశాఖ జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 8, తూర్పు గోదావరిలో 9 మంది, అనంతపురంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు 1800 మందిని పరీక్షించారు. అందులో 1175 మందికి నెగటివ్ వచ్చిందని మరో 493 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి వుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
మంగళగిరిలో 65 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ రావడంతో ఆ బజార్‌లో వున్న కూరగాయాల దుకాణాలు, కిరాణా దుకాణాలు, మార్కెట్‌లని మూసివేసి 3 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్‌గా ప్రకటించారు. 144 సెక్షన్‌ని విధించినట్టు మంగళగిరి పురపాలక కమీషనర్ వెల్లడించింది. నిజాముద్దీన్ వెళ్లి కరోనాతో తిరిగి వచ్చిన వారి వల్లే ఏపీలో ప్రమాద గంటికలు మోగుతున్నాయని అధికారులు భయాందోళనకు గురవుతున్నారు.