కృష్ణా జలాల విభజన విషయమై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు నువ్వా నేనా అంటున్నాయి. పోతిరెడ్డిపాడు వద్ద రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి మరిన్ని నీటిని తోడుకొనేలా ఏపీ సర్కార్ ప్రణాళిక వేసుకుంది. కానీ అలా చెస్తే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని కేసీఆర్ సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రాజెక్టును వ్యతిరేకించాయి. కానీ ఏపీ మాత్రం వెనక్కు తగ్గేది లేదంది. ఇక భాజాపా అయితే కేంద్ర జలవనరుల మంత్రి నుండి ప్రాజెక్ట్ మీద స్టే తెచ్చింది.
రెండు రాష్ట్రాలు కృష్ణా రివర్ బోర్డ్ వద్ద పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. తెలంగాణ సర్కార్ నిర్మించిన పలు ప్రాజెక్ట్స్ మీద ఏపీ కృష్ణా, గోదావరి బోర్డులకి పిర్యాధు చేయగా ఏపీ అక్రమంగా కృష్ణా నుండి అదనపు జలాలను వాడాలని చూస్తోందని, అలా చేస్తే తెలంగాణకు తీవ్ర నష్టమని తన పిర్యాధులో పేర్కొంది. ఈ పిర్యాధుల పర్వంలో ఎవరికి అనుకూలంగా బోర్డ్ స్పందిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. కానీ వీటిని పరిశీలించిన కృష్ణా రివర్ బోర్డ్ ఏపీకే రివర్స్ షాక్ ఇచ్చింది.