ఎస్వీబీసీ ఛానల్ ఎండీగా అదనపు ఈవో ధర్మారెడ్డి?

 

తాజగా టిటిడి లోని ఎస్వీబిసి ఛానల్ చైర్మన్ గా ప్రముఖ నటుడు పృద్విరాజ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవిలో టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి ని చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు ఎపి ప్రభుత్వం ఎస్వీబిసి ఛానల్ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేస్తుంది. తాజగా ధర్మారెడ్డి ని చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టిటిడిలో దళారుల వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో ధర్మారెడ్డి కీలకంగా పనిచేశారన్న పేరు తెచ్చుకున్నారు. దాంతో ఎస్వీబిసి ని కూడా దారిలో పెదరతాన్న ఆలోచనతోనే ఆయనను ఈ పదవికి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతానికి చైర్మన్ పోస్ట్ ను ఖాళీగానే ఉంచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సినీ నటుడు పృద్వి ఉదంతం పెద్ద సంచలనం రేపిన సంఘటనతో ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందట. సినీ నటుడు పృద్వి ఎస్వీబిసి మహిళా ఉద్యోగిని వేదించారన్న ఆరోపణలు రావడం .. ఆ వెంటనే దానికి సంబందించిన టేప్ లీక్ అవ్వడంతో పెద్ద దుమారమే రేగింది. దాంతో పృద్వి స్వతహాగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రిద్వి రాజీనామా తరువాత ఈ పదవి ఎవరికీ కట్టబెడతారో అన్న విషయం పై పలువురు పేర్లు వినిపించాయి.

ఆ లిస్ట్ లో జర్నలిస్ట్ స్వప్న, మాజీ సి ఎస్ ఐ వై ఆర్ కృష్ణారావు, దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ల పేర్లు ప్రధానంగా వినిపించాయి .. అయితే ఎస్వీబిసి చైర్మన్ గా మహిళను నియమించాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి కలిగిందట .. కానీ ఆ విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకోవడం లేదని, అందుకే ప్రస్తుతానికి చైర్మన్ పదవిని అలాగే ఖలీగా ఉంచేయాలని ఫిక్స్ అయ్యారట. మరి ఆ తర్వాత ఎవరు ఈ చైర్మన్ పదవిని చేపడతారో అన్న ఆసక్తి మాత్రం అందరిలో ఉంది.