ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొబ్డే ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో ప్రభుత్వం కోరింది. ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంది.
ప్రభుత్వ పిటిషన్‌లోని ప్రధాన అంశాలు
- రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారు
- రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించలేదు.
- ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి ఇది సుప్రీం తీర్పుకు విరుద్దం
- కరోనా వైరస్ కట్టడి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు అవసరం
- ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఊతం లభిస్తుంది
- హై కోర్ట్ ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారిని సంప్రదించకుండా ఆపడం తగునా?