ఇదేందో చదివి చెప్పండి… ఈ వీడియో చూడండి… డిజిపికి హైకోర్టు షాక్

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరుపై హై కోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విశాఖపట్నంలో చంద్రబాబుకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 151 కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఓ సారి దాన్ని చదివి చెప్పండి? అని ప్రశ్నిచింది. తీవ్ర నేరాలకిచ్చే నోటీసును చంద్రబాబుకు ఏసీపీ ఇవ్వడం ఏమిటి? దానిని పోలీసు కమిషనరు సమర్థించడం ఏమిటి? రాజధాని గ్రామాల్లో 500 మంది పోలీసులతో ప్లాగ్ మార్చ్ నిర్వహించడం ఏమిటీ? ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. ఇంకోటా…? అంటూ డీజీపీ గౌతం సవాంగ్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పోలీసుల తీరుపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని అని పేర్కొంది. విశాఖలో చంద్రబాబు అరెస్ట్, రాజధాని గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ పై సమాధానం ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది.

చంద్రబాబు అరెస్టు నిబంధనలకు విరుద్ధంగానే జరిగిందని ఒప్పుకున్న డీజీపీ రాజధాని గ్రామాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా అలా చేయాల్సి వచ్చింది అని పేర్కొనగా పెన్ డ్రైవ్‌లో ఉన్న వీడియోను చూశారా.. అందులో ఏముందో చూసి చెప్పండి అంటూ ధర్మాసనం వ్యాఖ్యానిచిందిం. అక్కడ అంతమంది అవసరమా? ఆ వీడియోలోని పోలీసు హెచ్చరికలు అభ్యంతరకరంగా ఉన్నాయి. అంత అవసరం ఏం వచ్చింది? అని ప్రశ్నించింది. రాష్ట్రంలో పోలీసులు నిబంధనలకు అనుగుణంగా పని చేయడం లేదని అభిప్రాయపడింది. పోలీసుల తీరు ఇలాగే ఉంటే తగిన ఆదేశాలిస్తామని హెచ్చరించింది.

సీఆర్‌పీసీ 151 కింద ఇచ్చిన నోటీసులపై బాధ్యులైన పోలీసు అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సవాంగ్ సమాధానం ఇచ్చారు. నోటీసు జారీకి బాధ్యుడైన ఏసీపీపై చర్యలు తీసుకోవాలని, దానిని సమర్థించిన విశాఖ పోలీసు కమిషనరుపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వీటన్నిపైనా వివరాలను పొందుపరుస్తూ నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.ఉ