ఆధార్‌కార్డ్ ఎంత ముఖ్యమో మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా ప్రూఫ్ కోసం ఆధార్‌నే అడుగుతున్నారన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు ఏవైనా పొందాలంటే ఆధార్ తప్పనిసరి. ఇది మనకు ఒక గుర్తింపు కార్డుగా కూడా పని చేస్తుంది.
ఇది మనకు ఒక్కోసారి ఏవో పనిలో పడి మనం వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతుంటాం. కొన్ని సందర్భాల్లో ఎంతో ముఖ్యమైన పనుల్లో మనకు కనిపించకుండాపోతుంది. అయితే ఇలాంటప్పుడు కంగారు పడకుండా మీకొక కొత్త చిట్కా. ఆధార్‌కార్డు కనిపించకపోతే దీని కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో కూర్చొని పని పూర్తి చేసుకోవచ్చు.
అదెలా అనుకుంటున్నారా…యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇటీవల కొత్తగా ఎం ఆధార్ యాప్‌ను లాంచ్ చేసింది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. దీంతో ఎన్నో రకాల సేవలు పొందొచ్చు. కొత్త ఆధార్ కార్డు కూడా తీసుకోవచ్చు.
కొత్త mAadhaar యాప్‌తో ఆధార్ కార్డు డౌన్లోడ్, ఆఫ్‌లైన్ కేవైసీ, స్కాన్ క్యూఆర్ కోడ్, అప్డేట్ అడ్రస్, వెరిఫై ఆధార్, వెరిఫై ఈమెయిల్, యూఐడీ/ఈఐడీ తిరిగి పొందటం, అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవడం వంటి చాలా సర్వీసులు పొందొచ్చు. వీటితోపాటు ఆధార్ రిప్రింట్ కోసం కూడా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.
ఆధార్ రిప్రింట్ కోసం రిక్వెస్ట్ పెట్టుకుంటే రూ.50 చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు కొత్త ఆధార్ కార్డు 15 రోజుల్లోగా మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇకపోతే ఎంఆధార్ యాప్‌లో ప్రధానంగా ఆధార్ సర్వీసెస్ డ్యాష్‌బోర్డు, మై ఆధార్ అనే రెండు సెక్షన్లు ఉంటాయి. ఈ యాప్ తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంటి నుంచే అన్ని పనులు చేసుకోవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే అన్ని పనులు పూర్తవుతాయి.