అయ్యో..  పవన్ ఎందుకు ఇలా అయిపోయాడు ? 

 
ఆంధ్రాలో ఎలాగైనా  బలపడటానికి  అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఇప్పటికే టీడీపీకి ఆర్ధిక బలం అందిస్తోన్న నేతలను  ఎప్పుడో తమలో కలిపేసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం.. అలాగే గత కొన్ని రోజులు నుండి జనసేనను కూడా తమలో కలుపుకోవాటాకి ఆలోచన చేస్తోందట. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఈ పక్రియ ఉంటుందని సమాచారం.  అందులో భాగంగానే ముందుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తమ మనిషిగా  తమ మద్దతు దారుడిగా కాషాయ జెండాను పూసే కార్యక్రమాన్ని పూర్తి చేసింది. నిజానికి ఇప్పుడే కాషాయ జెండా కప్పుకుంటే  రాజ్యసభ సీటు అని కూడా పవన్ కి ముందు  ఆఫర్ చేసిందట రాష్ట్ర నాయకత్వం.  కానీ బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం  అది వచ్చే ఎన్నికల నాటికి చూద్దాంలే అని పవన్ కు ప్రస్తుతం తమ మనిషి అనే సర్టిఫికెట్ ఇచ్చి సరిపెట్టారు.     
 
అయితే  పవన్ కళ్యాణ్ ఆసక్తి ఏమిటో..  బీజేపీకి ఆయనకు మధ్య ఉన్న  అండర్ స్టాండింగ్ ఏమిటో ఆయనకే తెలియాలి.  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. బీజేపీతో కలిసి పని చేస్తామని ఆ మధ్య పవన్ స్టేట్ మెంట్స్ ఇచ్చాడు. కానీ ప్రస్తుతం  పవన్ నోటి నుండి ప్రత్యేక హోదా అనే పదమే రావట్లేదు. పవన్ ఎందుకు ఇలా అయిపోతున్నాడో  ?   నిజానికి పవన్ పార్టీ ప్రకటించిన రోజున జనసేన పరిస్థితికి… ఈ రోజు నాటికీ జనసేన పరిస్థితికి అసలు వ్యత్యాసమే లేదు. అంటే ఇన్ని సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ సాధించింది ఏమిటి ?  ఏమి లేనట్టేగా.  అసలు పవన్ అమాయకత్వానికి కోప్పడాలో  లేక  కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడులే అని జాలిపడాలో కూడా  తెలియట్లేదు. 
 
అయినా పవన్ కళ్యాణ్ మాత్రం  వాస్తవ పరిస్థితులను అసలు పరిశీలిస్తోన్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. తన ట్వీట్స్,  తన పేపర్ స్టేట్ మెంట్స్ తప్పితే  చేస్తోంది ఏమి లేదు. నిజానికి  రోజురోజుకి ప్రజల్లో  పవన్ నమ్మకాన్ని కోల్పోతున్నాడు. పవన్ ఫ్యాన్సే అయ్యో..  పవన్ ఎందుకు ఇలా అయిపోయాడు ? అని బాధ పడుతున్నారట.  మరి ఇప్పటికైనా ముందుచూపు రాజకీయాలు చేస్తూ.. జనసేనను ప్రజల్లో తీసుకువెళ్లే కార్యక్రమాల్లో నిత్యం చేస్తూ ఉంటే..  పవన్ కళ్యాణ్ కి భవిష్యత్తులోనైనా   రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మొన్న ఎన్నికల ఫలితాలే  మళ్ళీ మళ్ళీ పవన్ కి ఎదురుకాక తప్పదు.