అడ్డంగా బుకాయిస్తున్న అచ్చెన్న

తప్పు చేసి దొరికిపోయి కూడా అడ్డంగా బుకాయిస్తున్నారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. తిరుమలకు వెళ్ళే బస్సుల్లో ప్రయాణీకులకు ఇచ్చే టికెట్ల వెనుక అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రకటనలు ఉండటం సంచలనంగా మారింది. రంజాన్, జెరూసలేం పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ప్రకటనలున్నాయి. వాటితో పాటు ముస్లిం మైనారిటిలు, క్రిస్తియన్లకు సంబంధించిన సంక్షేమ పథకాల వివరాలు ఉన్నాయి.

ఎప్పుడైతే టికెట్ల వెనుక అన్యమత ప్రచారం విషయం వెలుగులోకి వచ్చిందో టిడిపి, బిజెపిలో సంయుక్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపోతున్నాయి. నిజానికి ఆ టికెట్లు ముద్రించింది 2019, మార్చిలో. అంటే అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబునాయుడే. అన్యమత ప్రచారం వెనుక వాస్తవాలను ప్రభుత్వం బయటకు తీసిన ప్రభుత్వం టికెట్లు ప్రింటయ్యింది చంద్రబాబు హయాంలోనే అన్న విషయాన్ని బయటపెట్టింది.

దాంతో మాజీ మంత్రి అచ్చెన్న అడ్డంగా మాట్లాడుతున్నారు. టికెట్ల ప్రింటింగ్ తో తమకు సంబంధమే లేదని బుకాయిస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో రవాణాశాఖ మంత్రిగా అచ్చెన్నే పనిచేశారు. అసలు 2019, మార్చిలో టికెట్లు ప్రింటయ్యాయంటే అర్ధమేంటి ? టిడిపి ప్రభుత్వంలోనే అని అందరికీ తెలుస్తోంది. ముస్లిం, క్రిస్తియన్ ఓట్లను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారు. అయితే ఎన్నికల కోడ్ రావటంతో టికెట్ల పంపిణీ జరగలేదు. ఆ టిక్కెట్లే ఇంతకాలానికి బయటకు వచ్చాయి.

టిడిపి ప్రభుత్వంలో ప్రింట్ అయినట్ల ఆధారాలు ఇంత స్పష్టంగా కనబడుతున్నా అచ్చెన్న మాత్రం టిక్కెట్లతో తమకు సంబంధమే లేదని బుకాయిస్తుండటంతో అదరూ ఆశ్చర్యపోతున్నారు. టిక్కెట్లు ఇపుడు చెలామణిలోకి తేవటంలో అధికారుల అత్యుత్సాహం కూడా ఉన్నట్లే ఉంది. జగన్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే కుట్ర ఏమన్నా జరుగుతోందేమో చూడాల్సిందే.