పోలీస్ వ్యవస్థ అంటేనే ప్రజలకి రక్షణగా ఉంటామని భరోసా ఇవ్వడం… పోలీస్ అంటేనే కష్టకాలంలో కూడా ధైర్యంగా నిలబడటం. కానీ, ప్రజలకి కష్టం వస్తే నేనున్నామంటూ ముందుకు రావాల్సిన ఓ పోలీసే పోరాడలేక ప్రాణం తీసుకోవడమా… విశాఖ నగరంలో అప్పుగర్ ప్రాంతంలో ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడిన ఈ సంఘటన అక్కడి వారికి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆ ప్రాంత వాసులని ఆందోళనకు గురి చేసేలా చేసింది. శ్రీకాకుళం జిల్లాకు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆయన మరణించారు.
కారణం ఏమై ఉంటుంది..? కృష్ణ వర్మ గత కొద్దీ రోజులుగా లంగ్ క్యాన్సర్ తో బాధపడటమేనా ? కొంత కాలంగా చికిత్స పొందుతున్నా.. ఆయన తీవ్ర మనో వేదనకు గురి అవుతున్నారా.. బహుశా ఆ వేదనే అయన నిండు ప్రాణాలను బలి తీసుకుని ఉండి ఉంటుంది. ఆయన తన తన కుటుంబీకుల కోసమైనా ఆత్మహత్యకు పాల్పడకుండా ఉండాల్సింది. ఈ ఘటన పై ఆయన కుటుంబీకులు శోకసంద్రంలో మునిిపోయారు. ఇప్పటికే ఈ విషయం తెలిసిన పోలీస్ అధికారులు డీఎస్పీ నివాసానికి చేరుకుంటున్నారు. ఇక ఈ ఘటన పై పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఆవేదన మనిషిని లొంగతీకుంటుందని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.