రేపు తిరుపతిలో బాంబు పేల్చనున్న మోత్కుపల్లి

తెలంగాణ టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు  తిరుపతిలో తన మాటలతో ఎటువంటి మాటల బాంబు పేల్చనున్నారో  అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన నేడు తిరుమలకు బయలు దేరి వెళ్లనున్నారు. రేపు ఉదయం తిరుమలకు చేరుకొని అలిపిరి వద్ద ప్రెస్ మీట్ పెడతానని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు వ్యతిరేక శక్తులన్నీ ఏకమై ఆ దుర్మార్గుడిని రాజకీయంగా బొందపెట్టాలని ఆ దేవుడిని వేడుకుంటానన్నారు. దళితులు, బలహీన వర్గాలు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. దిక్కలేని వాడికి దేవుడే దిక్కని తన 64వ పుట్టిన రోజు సందర్భంగా తన మానసిక క్షోభను దేవునికి చెప్పుకోవడానికి తిరుమల వెళ్తునానన్నారు. 12వ తేదిన దర్శనం పూర్తయ్యాక ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు చెబుతానన్నారు.

ఎమ్మెల్యేగా , మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి నర్సింహులు…  తనకు చంద్రబాబు గవర్నర్ పదవి ఇప్పిస్తానని మాట ఇచ్చి మాట తప్పారని, అది నన్ను చాలా ఆవేదనకు గురి చేసిందని పలుసంధర్భాల్లో మోత్కుపల్లి చెప్పారు. చంద్రబాబు నయవంచకుడు అని సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. చంద్రబాబు పై గత కొంత కాలంగా మోత్కుపల్లి అసంతృప్తిగా ఉన్నారు. తిరుపతిలో మోత్కుపల్లి తన మాటలతో ఎటువంటి విమర్శలు చేయనున్నారో, మళ్లీ ఏ బాంబు పేల్చనున్నారో అని అంతా  ఎదురు చూస్తున్నారు.