అందుకేనేమో మద్యదుకాణాలు తెరవాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని ఉంటాయి. సరే ఇంతకీ మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారా ? సోషల్ మీడియాలో జనం బారులు చూస్తే తెలుస్తోంది, చర్యలు ఎలా ఉన్నాయో..? అయినా 65 ఏళ్లవారు బయటకు రావద్దని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది, కానీ మద్యం షాపుల వద్ద ఆ వయసువారే అధికంగా కనిపిస్తున్నారనేది వాస్తవం. ప్రాణాలకు తెగించి ముందు సాధిస్తున్నారు, యుద్ధ భూమిలో వీరులు కూడా ఇంతలా ప్రాణాలను పణంగా పెట్టరేమో.. వయసు ముదిరిన ముందు బాబులు మాత్రం మద్యం కోసం ఏమైనా చేసేలా ఉన్నారు.
ఈ తరహా చర్యల వల్ల కరొనాను ఆపగలమా ? కరోనా మరోసారి విజృభింస్తే మన వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది.. అపహాస్యమవుతుంది కూడా. అయినప్పటికీ, మన ప్రభుత్వాలకు మద్యం విక్రయాల వల్ల వచ్చే ఆదాయమే ముఖ్యమైపోయిందనేది కాదనలేని కఠోర నిజం అని చెప్పకతప్పట్లేదు.