కొడాలి నాని గుడివాడకు సంబంధించిన టిడిపి నాయకుడన్న విషయం అందరికి తెలిసిందే. టిడిపిలో ఒకానొక సందర్భంలో టిడిపిలో ఆయన చాలా కీలక పాత్రను పోషించారు. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న పరిచయం మేరకు టిడిపిలో టికెట్‌ను సంపాదించారు. అక్కడ రావి ఫ్యామిలీ ఉన్నప్పటికీ వాళ్ళను పక్కకు పెట్టి ఈయనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకానొక సమయంలో ఆయనకు బాబుకి కాస్త తేడాలు రావడంతో బాబుని ఢీ కొట్టడానికి కొడాలి సిద్ధమయ్యారు. దాంతో జగన్‌కి సపోర్ట్ చేస్తూ కొత్తగా చేసిన గన్నవరం ఎంపీ వల్లభనేని వంశీ ద్వారా కమ్మవారు కూడా తన వైపు ఉన్నారనే సంకేతాన్ని జగన్ ఇచ్చినట్లయింది. ఇటీవలె ఆయన కొన్ని సవాళ్ళు కూడా బాబుకు విసిరారు. కొడాలినాని మాటల ద్వారా కొడాలి నాని కమ్మసామాజిక వర్గానికి చెందిన వారందరూ తెలుగు దేశంలో ఉండరు అన్న ఫీలింగ్‌ని జగన్ సంకేతాలు ఇచ్చినట్లు అనిపించింది.
తెలుగు ప్రజల గుండెల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు ఇప్పుడు చెక్కుచెదరని స్థానం ఉంటుంది. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా మంచి అవకాశాలు కల్పించారు. ఎన్టీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఎంతో మంది సామాన్యులు రాజకీయాల్లో హీరోలయ్యారు. ఒకానొక సమచంలో ఈరోజు తెలంగాణ సీఎం గా ఉన్న కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు అలాగే ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది రాజకీయ నాయకులను తయారు చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుంది. అలాగే ఎంతోమంది పేద ప్రజలను తన సంక్షేమ పథకాల ద్వారా ఆదుకున్నాడు.
ఎన్టీఆర్ తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిన వారెవరికీ దక్కని క్రేజ్ మళ్లీ తిరిగి అలాంటి పాలనలోనే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెళ్ళారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా ఎంతో మంది పేద ప్రజలను ఆకట్టుకున్నారు. అదే దివంగత క్రేజ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి మాత్రమే దక్కింది. 2004లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైయస్ ఐదేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలతో రెండు మూడు తరాల ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.