‘జగన్’ది ట్రాక్ రికార్డ్ కాదు, ఆల్ టైం రికార్ద్ !

 
ఏపీ రాజకీయాలు గురించి క్లుప్తంగా చెప్పుకుంటే..   ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే  తన ప్రభుత్వ లక్యంగా  జగన్‌ ముందుకు వెళ్తుంటే..  మళ్లీ ఎలాగైనా సీఎం అవ్వాలనే అత్యాశతో చంద్రబాబు విమర్శలు చేస్తూ  కలసి రాని కాలాన్ని కష్టంగా నెట్టుకొస్తున్నాడు. ఇక ఈ ఏడాదిలో జగన్ సాధించిన ఘనతలు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. అయితే ఆ ఘనతల్లో పొందాల్సిన స్థాయిలో  పొగడ్తల వర్షాన్ని అందుకోలేకపోయిన ఘనతలు చాల ఉన్నాయి.  అంతెందుకు మహిళల విషయానికే వద్దాం  ఓట్లుతో సంబంధం లేకుండా  రిజర్వేషన్లలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన ఏకైక ప్రభుత్వం జగన్‌ ప్రభుత్వమే అనేది కాదనలేని నిజం.  ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని.. స్వయం సహాయక సంఘాలు బలోపేతం కావాలని జగన్ ఆలోచన.  ఆ ఆలోచనకు అనుగుణంగా పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి మహిళలకు  బాబు ఏమి చేశాడు ?  గత ఎన్నికల్లో ఓట్లు దండుకోనేందుకు పసుపు-కుంకుమ పేరుతో  మహిళలను మోసం చేసే ప్రయత్నం చేశాడు. చివరికీ వాళ్లే బాబును మోసం చేశారనుకోండి అది వేరే విషయం.
 
వాళ్ళు అలా మోసం చేయడానికి ప్రధాన కారణం  బాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని  మాటలు చెప్పి.. కాలం వెళ్లబుచ్చాడు.  కానీ  వైఎస్‌ జగన్‌  ఇచ్చిన మాట ప్రకారం నాలుగు దశల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.  ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీఆర్ పాలనలో  ఆ తరువాత మహానేత వైఎస్సార్‌ హయాంలో..  నేడు  జగన్‌ పరిపాలనలో సామాన్య ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని ప్రజలు చెప్పుకుంటున్నారంటే  జగన్ సాధించింది ఏమిటో తెలియట్లేదా ? అభివృద్ధి కోసం ఎక్కడ కూడా తగ్గకుండా ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి,  తన తండ్రి ప్రారంభించినటువంటి ఆరోగ్య శ్రీ పథకంలో ఎన్నో కీలకమైన మార్పులు చేసి, వైద్యాన్ని రాష్ట్ర ప్రజలందరికి  మరింత చేరువ చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా  కీలక నిర్ణయాలతో  తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు. 
 
పైగా రైతు భరోసా, అలాగే ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం, అమ్మఒడి, పేదలకు ఇంటి స్థలాలు, పక్కా ఇల్లు  ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ ది ట్రాక్ రికార్డ్ కాదు , ఆల్ టైం రికార్డే.  ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకున్న జగన్..  రాష్ట్రాభివృద్ధి కోసం  ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా  వాటిని అవలీలగా ప్రకటించేయడం.. అమలు పరచడం..  ఈ తరంలో ఒక్క జగన్ కే  చెల్లిందని చెప్పుకోవాలి.