జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి… తనదైన పాలనతో దూసుకుపోతున్నారో లేదో తెలియదు గాని, తన పాలనకు ఇబ్బందులు కలిగించే అధికారులను మాత్రం బదిలీ చేయటమో కుదిరితే తొలగించేయడమో చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్పుతో సంచలనం సృష్టించిన జగన్, ఆ తరువాత ఎన్నికలు వాయిదా వేయడంతో ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కూడా బదిలీ చేసి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు మరో అధికారి పై కూడా వేటు వేయాలనే ఆలోచనలో ఉన్నారట. పాలనలో ప్రజలకు మేలు చేసేందుకు ముందుకు సాగడమే లక్ష్యంగా పని చేయాల్సిన ముఖ్యమంత్రి, ఇలా కాస్త ఇబ్బందులు కలిగించే అధికారులను కూడా తొలగించుకుంటూ పోతే ఎలా ?
జగన్ సర్కారుకు ఇదేం పట్టదు. ఆంధ్రకు జీవనది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు సాంకేతిక న్యాయ సలహాదారు అయినా హెచ్కే సాహు ని విధుల నుంచి తొలగించింది ఏపీ సర్కార్. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కూడా. హైదరాబాద్ లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టుకు అవసరమైన సాంకేతిక న్యాయ సలహాల కోసం ఏకంగా నెలకు రెండు లక్షల వ్యయంతో… సాహోను ఏప్రిల్ 14 2018న కన్సల్టెంట్ గా ఆనాడు అధికారంలోఉన్న చంద్రబాబునాయుడు నియమించారు. అందుకేనేమో కన్సల్టెంట్ గా సాహోని తొలగించే ప్రతిపాదనల పై జగన్ సర్కార్ ఆమోదముద్ర వేసింది.