కరోనా ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు తాత్కాలిక బ్రేక్ వేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉగాధి రోజు నిర్వహించ తలపెట్టిన 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ ఏప్రిల్ 14కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం కరోనా వైరస్ నివారణ పనుల్లో బీజీగా ఉంటడం వల్లే అంబేద్కర్ జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల వాయిదాను సమర్థిస్తూ.. అలాగే ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఉగాదికి పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ ప్రక్రియ ఉంటుందని అంతా సంబర పడ్డారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఇళ్ల పంపిణీకి బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.