అసంతృప్తి ఎమ్మెల్యేలను జగన్ ఏం చేస్తాడో ?

 
జాతీయ పార్టీల్లోని రాజకీయ నాయకులకు స్వతంత్రం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా మీడియా ముందు వ్యక్తం చేసే దైర్యం  వారికి ఎక్కువే. అదే  వైసీపీ, టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులకు ఏ విషయాన్ని అయినా పార్టీ ముఖ్య నాయకులతో చర్చించాలే తప్ప  బహిరంగంగా ప్రస్తావిస్తే చర్యలు తప్పవు. అందులో జగన్ వంటి నాయకుడి వద్ద అటువంటి సాహసన్ని చేయడం మాములు విషయం కాదనే చెప్పాలి. అయినప్పటికీ  వైసీపీ ప్రభుత్వంలో అసంతృప్తి రాగాలు  ఊపందుకున్నాయి.  ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు కొద్దీ రోజులుగా  లోలోపలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనేది  నిజం. 
 
ఈ వ్యవహారంలో కొందరు సీనియర్ నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయన నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేయించుకోలేక పోవడంతో అసంతృప్తితో ఉన్నారట. మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుది ఇదే పరిస్థితి. బొల్లా బ్రహ్మనాయుడు మళ్ళీ పోటీ చేసే అవకాశం లేదని ఇప్పుడే నియోజకవర్గ ప్రజలకు ఏదైనా మేలు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎదురవుతున్న సమస్యలతో సతమతం అవుతున్నారు.
 
ఇక ఎంపీ రఘురామ కృష్ణంరాజు బీజేపీ సంబంధాలు ఉన్నాయని బహిరంగంగా ప్రకటించారు. వీరు ఇసుక విధానం, టిటిడి భూముల అమ్మకం, అభివృద్ధి పనులు, ప్రభుత్వ విధానాల పై విమర్శలు చేసారు.  వీరి విషయంలో తీసుకోవాల్సిన చర్యల పై పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న నాయకులు చర్చలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తి ఎమ్మెల్యేలను   సీఎం జగన్ ఏం చేస్తారో చూడాలి.