అమరావతిలో రైతులది కృత్రిమ ఆందోళనా ?

రాయలసీమలో ఆందోళనల్లేవ్‌.. ఉత్తరాంధ్రలో అసలే లేవు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పట్టించుకోవడంలేదు. ఉభయ గోదావరి జిల్లాలూ లైట్‌ తీసుకున్నాయి. నిజానికి, కృష్ణా జిల్లాలో కూడా పెద్దగా అలజడి కన్పించడంలేదు. ఏదన్నా కాస్త హంగామా వుందంటే గుంటూరు జిల్లాలోనే. అది కూడా, రాజధాని అమరావతి పరిధిలోనే కొంత గందరగోళం కన్పిస్తోంది.. మిగతా గుంటూరు జిల్లా అంతా ప్రశాంతంగానే వుంది.

ఒక్కటి మాత్రం నిజం.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ రైతుల్లో ఎక్కువమంది టీడీపీకి మద్దతుదారులే వున్నారన్నదీ నిర్వివాదాంశం. అమరావతి రాజధాని అయితే, తమ భవిష్యత్తు బంగారంగా మారుతుందని భావించినవాళ్ళంతా ఇప్పుడు ఆందోళన బాట పట్టారు. అయితే, అమరావతి ఎక్కడికీ పోదనీ.. అమరావతిలోనే అసెంబ్లీ వుంటుందనీ, రాజ్‌భవన్‌ కూడా వుంటుందనీ, దాంతోపాటుగా హైకోర్టు బెంచ్‌ కూడా వుంటుందన్నది జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ సారాంశం.

కానీ, తెలుగుదేశం పార్టీ కలవరపడుతోంది. రాష్ట్రాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ సర్వనాశనం చేస్తున్నారన్నది టీడీపీ ఆరోపణ. ఇంకా ఆ కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదు. రాజధానిని మార్చే పనీ ప్రారంభించలేదు. కర్నూలులో హైకోర్టు.. అనగానే రాయలసీమలో నిన్న మొన్నటిదాకా విన్పించిన ఆందోళనలు మాయమైపోయాయి.

నిజానికి, రాయలసీమలో మొత్తం నాలుగు జిల్లాల వున్నాయి గనుక.. అక్కడ సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం తన విధానాన్ని ఇంకా ప్రకటించాల్సి వుంది. అయినా, రాయలసీమ ప్రశాంతంగానే వుంది.. అదే టీడీపీకి నచ్చడంలేదు.

ఉత్తరాంధ్ర సంగతి సరే సరి. ఉత్తరాంధ్ర ప్రజానీకం పూర్తిస్థాయి హ్యాపీనెస్‌తో కన్పిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని తూర్పుగోదావరి జిల్లా కూడా విశాఖ రాజధాని.. అంటే హ్యాపీనే. పశ్చిమగోదావరి జిల్లా వాసులకి పెద్దగా ఈ వ్యవహారంతో సమస్యల్లేవ్‌.

రాష్ట్రంలో ఒక్క గుంటూరు జిల్లా.. అందునా అమరావతి ప్రాంతంలోనే ఆందోళనలు జరుగుతున్న దరిమిలా.. ఏపీ టీడీపీ నేతల్లో చాలామంది ఎందుకు ‘బీపీ’ పెంచుకుంటున్నారట.? అమరావతిపై వీళ్ళేదో అదనపు ప్రయోజనాన్ని ఆశించి వుండాలి. అది దక్కనందుకే ఇంత గుస్సా అవుతున్నారన్న విషయం సుస్పష్టమవుతోందిక్కడ.

 

From FB,Courtesy –

Srinivas Vattam