Muthyala Venkateshwara Rao: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు స్థానిక ప్రముఖులపై సర్వేలు చేయడం ప్రారంభించారు. ఏ ప్రముఖుడు తమ పార్టీకి ఉపయోగపడతాడా.. ఎప్పుడెప్పుడు అతనిని వాళ్ల పార్టీ వైపు తిప్పుకుందామా అనే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అలాగే ఇప్పుడు అందరి కళ్ళు ఎం వి ఆర్ అని పిలబడే ముత్యాల వెంకటేశ్వరరావు పై పడ్డాయి. ఎవరీ ఎం వీ ఆర్.. ఆయనకి అంత ఇంపార్టెన్స్ ఏమిటి ఒకసారి చూద్దాం.
ఎం వి ఆర్ అనబడే ముత్యాల వెంకటేశ్వరరావు సుప్రసిద్ధుడైన ప్రముఖ టెక్స్టైల్ వ్యాపారి. 40 ఏళ్లు గా అనకాపల్లి కేంద్రంగా టెక్స్టైల్ రంగంలో ప్రభంజనం సృష్టించిన వ్యక్తి. వ్యాపార పరంగానే కాకుండా పురాతన ఆలయాలను పునరుద్దించడం, ధూప దీప నైవేద్యాలు లోటు లేకుండా చేయటం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం అలాగే తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగులకు స్థాయి తో సంబంధం లేకుండా బస్సుల ద్వారా ఇంటికి పంపించడం, వృద్ధులను నిత్యం పుణ్యక్షేత్రాలు, పర్యటనలకు పంపించడం..
ఏడాదిలో ఆరు నెలలు పాటు యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించడం వంటివి చేయడం ద్వారా ఆయన అనకాపల్లి నియోజకవర్గంలో స్థానికంగా బాగా ఫేమస్. అలాంటి వ్యక్తిని రాజకీయ పార్టీలు తమ పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఎం వి ఆర్ ఆర్థికంగా కూడా చాలా బలవంతుడు అతను ఎంపీగా పోటీలో ఉంటే ఏ పార్టీకైనా ఆర్థికంగా వెన్నుదన్ను లభించినట్లే. చంద్రబాబు నాయుడు తోనూ పవన్ కళ్యాణ్ తోనూ సత్సంబంధాలు కలిగిన ఈ వ్యక్తి మీద చంద్రబాబు నాయుడు సర్వే కూడా చేయించారు.
అందులో ఎంవిఆర్ పట్ల ప్రజల్లో అద్భుతమైన ఆదరణ ఉన్నట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లి నియోజకవర్గం హాట్ సీట్ అని చెప్పాలి. అక్కడ పోటీ చేయడానికి జనసేన తరపు నుంచి నాగబాబు సన్నద్ధమవుతున్నారు. అయితే ఎం వి ఆర్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తారా.. ఇస్తే ఏ పార్టీ తరఫున చేస్తారు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది ఎం వి ఆర్ అయితే ఈ విషయంపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.