బాలయ్య వ్యాఖ్యాతగా అహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం మొదటి సీజన్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సీజన్ సక్సెస్ అవడంతో రెండవ సీజన్ కూడా ఎంతోఘనంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సీజన్ టు నాలుగు ఎపిసోడ్లు పూర్తి కాగా ఐదవ ఎపిసోడ్లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హాజరైనట్లు తాజాగా గ్లింప్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ప్రభాస్ పెళ్లి గురించి తన అఫైర్స్ గురించి ప్రస్తావించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే బాలయ్య ప్రభాస్ ను ప్రశ్నిస్తూ అనుష్కతో నీ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది అంటూ డైరెక్ట్ గా అడిగారని సమాచారం. అయితే బాలకృష్ణను ఈ ప్రశ్న అడగడంతో ప్రభాస్ రియాక్షన్ మారిపోవడమే కాకుండా మీడియా వాళ్ళు ఇప్పటికే నాకు అనుష్కకు ఎన్నోసార్లు పెళ్లి కూడా చేశారని ఇలాంటివన్నీ సర్వసాధారణమే అంటూ చెప్పారని తెలుస్తోంది.
ఇకపోతేబాలకృష్ణ కేవలం ప్రభాస్ అఫైర్స్ గురించి మాత్రమే కాకుండా తన పెళ్లి గురించి కూడా ప్రశ్నించడంతో త్వరలోనే తన పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెబుతానని ప్రభాస్ చెప్పారంటూ సోషల్ మీడియాలో ఈ ఎపిసోడ్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. ఇక ఈ ఎపిసోడ్ కిసంబంధించిన ప్రోమోల కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ అతి త్వరలోనే ప్రసారం చేయనున్నట్టు సమాచారం.