జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పరిచయమైనటువంటి ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడటం అనంతరం ఆ స్నేహం ప్రేమగా మారిందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ఈ జంట గత ఏడాది జబర్దస్త్ వేదికగా అందరికీ తెలియజేశారు.అయితే గత ఏడాది వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నామని తెలియజేసిన ఈ జంట తాజాగా తమ పెళ్లి గురించి ప్రకటించారు.
జోర్దార్ సుజాత జబర్దస్త్ కార్యక్రమంతో పాటు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మా ప్రేమ ప్రయాణం గమ్యం చేరింది అంటూ ఒక వీడియోని అభిమానులతో పంచుకున్నారు.ఈ వీడియో ద్వారా రాకింగ్ రాకేష్ తో తన పరిచయం ఎలా ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారడం ప్రేమ పెళ్లి వరకు ఎలా వెళ్ళింది అనే విషయాలన్నింటినీ కూడా తెలియజేశారు.
ఇక తమ పెళ్ళికి తమ పెద్దలు అంగీకారం తెలపడంతో తమకు చాలా సంతోషంగా ఉందని ఈ నెల చివరిన తమ నిశ్చితార్థం జరగబోతుందని తెలిపారు నిశ్చితార్థం రోజునే లగ్నపత్రిక రాసి పెళ్లి తేదీని కూడా తెలియచేయబోతున్నామని ఈ సందర్భంగా జోర్దార్ సుజాత తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించారు. ఇలా ఈమెఈనెల ఆఖరిన నిశ్చితార్థం అంటే వచ్చే నెలలోనే తన పెళ్లి జరగబోతుందని అభిమానులు భావిస్తూ తనకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.