Rocking Rakesh: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ అనంతరం హీరోగా మారినటువంటి వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. తాజాగా ఈయన కేశవ చంద్ర రామవత్ అనే సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లను కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో సంచలనంగా మారింది.
కమెడియన్ గా కొనసాగుతున్న రాకేష్ పెద్దపెద్ద టెక్నీషియన్లను ఉపయోగించి సినిమా చేశారు అంటే తప్పనిసరిగా ఈయన ఎవరికో బినామీగా వ్యవహరిస్తున్నారంటూ ఇన్కమ్ టాక్స్ అధికారులు ఆయన ఇంటిపై రైడ్ చేసినటువంటి ఒక వీడియో వైరల్ గా మారింది.. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాకేష్ విమర్శల పాలవుతున్నారు.
ఇక ఇందులో భాగంగా మీకు బినామీ ఎవరు అంటూ అధికారులు ప్రశ్నించగా తనకి ఎవరు బినామీలు లేరని కేవలం నామీద ప్రేమతోనే కొంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారని రాకేష్ తెలిపారు. మీకు రోజా బినామీగా వ్యవహరిస్తుంది కదా అంటూ అధికారులు ప్రశ్నించడంతో ఆమె కేవలం నాపై ప్రేమతో మాత్రమే ఈ వేడుకకు వచ్చింది జబర్దస్త్ కార్యక్రమంలో చేసే సమయం నుంచి ఆమెతో మంచి అనుబంధం ఉందని తెలిపారు.
మరి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎంపీ గారు అలాగే హరీష్ రావు రోజా వంటి రాజకీయ నాయకులు వచ్చారు. వారు నీ సినిమా కోసం ఎంత ఖర్చు చేశారూ అంటూ వరుస ప్రశ్నలు వేయడంతో నాకు వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వలేదని నా ఇల్లు కారు కూడా తాకట్టులో పెట్టే సినిమా చేశామని రాకేష్ తెలిపారు. అయితే ఇదంతా కూడా ఫ్రాంక్ అనే విషయం స్పష్టంగా తెలియడం ఈయనపై విమర్శలు వస్తున్నాయి. మరి నిజంగానే రాకేష్ సొంతంగా సినిమా చేశారా లేకపోతే ఈ వీడియోలో అనుకున్నట్టు రోజా బినామీగా వ్యవహరించారా అనే విషయంపై నేటిజన్స్ చర్చలు జరుపుతున్నారు.