డాన్స్ షో కంటెస్టెంట్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ గురించి తెలియని వారంటూ ఉండరు. విజయ్ నటించిన కొన్ని సినిమాలు అయినా కూడా పాన్ ఇండియా స్థాయిలో హీరోగా గుర్తింపు పొందాడు. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ ఎన్నోసార్లు తన మంచి మనసు చాటుకున్నాడు. తను నటించిన సినిమాలు ప్లాప్ అయితే నిర్మాతలు నష్టపోకుండా తన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇటీవల లైగర్ సినిమా ప్లాప్ అవటంతో విజయ్ తన రెమ్యూనరేషన్ నుండి 6 కోట్లు తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా విజయ్ ఓటీపీ ప్లాట్ఫామ్ ఆహా లో స్ట్రీమ్ అవుతున్న డాన్స్ ఐకాన్ షో కి గెస్ట్ గా హాజరయ్యాడు. ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో గెలిచిన వారికి స్టార్ హీరో ని కొరియోగ్రఫీ చేసే ఆఫర్ ఇచ్చారు. ఈ డాన్స్ షో లో పాల్గొన్న విజయ్ కంటెస్టెంట్స్ చేసే పెర్ఫామెన్స్ కు ఫిదా అయ్యాడు. అందులో ఒక కంటెస్టెంట్ బాధలు విని విజయ్ మనసు కరిగిపోయింది. ఆనంద్ అనే కంటెస్టెంట్ తల్లి త్రోట్ క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలో తన తల్లికి వైద్యం చేయించడానికి డబ్బులు లేక ఆనంద్ ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాకుండా డాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం సరైన బట్టలు కొనుక్కోవడానికి కూడా తన వద్ద డబ్బులు లేవని ఓంకార్ వెల్లడించాడు.

దీంతో విజయ్ స్పందిస్తూ..గతంలో తను అనుభవించిన కష్టాలు కూడా గుర్తు చేసుకుంటూ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేస్తున్న సమయంలో తన దగ్గర కూడా సరైన బట్టలు లేకపోవటంతో సినిమా ప్రమోషన్ కోసం ప్రొడ్యూసర్ ని అడిగి సినిమాలో వేసుకున్న కాస్ట్యూమ్ వేసుకొని ప్రమోషన్ కి వెళ్ళానని చెప్పుకొచ్చాడు. ఇక సరైన బట్టలు లేక ఇబ్బంది పడుతున్న ఆనంద్ ని ఓదార్చుతూ..ప్రస్తుతం తను రన్ చేస్తున్న రౌడీ వేర్ నుంచి తనకు కావల్సినన్న ఫ్యాషన్ వేర్స్ పంపుతానని తనకు నచ్చిన స్టైల్ లో బట్టలు వేసుకుని డాన్స్ చేయమని విజయ్ దేవరకొండ కంటెస్టెంట్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో విజయ అభిమానులు అతని మీద ప్రశంసలకు కురిపిస్తున్నారు.