వంటలక్క నిజ జీవితంలో ఇంత రిచ్చా… షాకింగ్ విషయాలు బయటపెట్టిన ప్రేమి విశ్వనాథ్!

కార్తీకదీపం సీరియల్ ద్వారా వంటలక్కగా ఫేమస్ అయిన ప్రేమీ విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ప్రేమీ విశ్వనాథ్ కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయింది. ఈ సీరియల్లో దీప పాత్రలో నటించిన ప్రేమీ విశ్వనాథ్ తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ సీరియల్లో కథ మొత్తం దీప చుట్టూ తిరగటంతో ప్రేమి విశ్వనాథ్ వంటలక్కగా బాగా పాపులర్ అయ్యింది. 5 ఏళ్ళుగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ద్వార ప్రేక్షకులను ఆకట్టుకుని ఇంట్లో మనిషిలా కలిసిపోయింది.

వంటలక్క పాత్ర ద్వారా ప్రేమీ విశ్వనాథ్ ప్రేక్షకులకు ఎంతగా దగ్గరయింది అంటే.. కొంతకాలం ఈమే సీరియల్ లో కనిపించకపోయేసరికి సీరియల్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో కొత్త కథనంతో మళ్ళీ ఈమె సీరియల్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ వంటలక్క పాత్ర పై సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వస్తుంటాయి. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సినిమాల్లో ‘వంటలక్క’ పేరుతో కామెడీ ట్రాక్ లు కూడా పండించారు. ఇలా వంటలక్క గా ఫేమస్ అయిన ప్రేమి విశ్వనాథ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

కార్తీకదీపం సీరియల్ లో ఎప్పుడు కష్టాలు పడుతూ వంటలు చేసుకొని బ్రతికే ఈ వంటలక్క నిజ జీవితంలో మాత్రం చాలా ధనవంతురాలని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కేరళలో ప్రేమి విశ్వనాథ్ కి రెండు సొంత స్టూడియోలు ఉన్నాయని..అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతూ ఉంటాయని… హైదరాబాద్ కు కేవలం ‘కార్తీక దీపం’ షూటింగ్ కోసమే వస్తానని వెల్లడించింది. ఇక్కడ తిరిగే టైం, ఇంటర్వూలు ఇచ్చే టైమ్ తనకి లేదని వెల్లడించింది. ఇలా ఈ సీరియల్ ద్వారా ఫేమస్ అయిన ప్రేమి విశ్వనాధ్ తెలుగులో ఒక స్టార్ హీరో సినిమాలు ప్రధాన పాత్రలో నటించే అవకాశం కూడా అందుకున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.