నాగచైతన్య సినిమాలో వంటలక్క.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన ప్రేమి విశ్వనాథ్?

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య సమంతతో విడాకుల అనంతరం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈయన థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయింది. ఈ క్రమంలోనే నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా NC 22 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన మరోసారి కృతి శెట్టి హీరోయిన్ గా అవకాశం అందుకున్నారు. ఈ సినిమాలో క్రేజీ ఆఫర్ అందుకున్నారు బుల్లితెర నటి వంటలక్క. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రేమి విశ్వనాధ్ అలియాస్ వంటలక్కఈ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలియజేశారు.

కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రేమి విశ్వనాథ్ దీప పాత్రలో హావభావాలను పలికిస్తూ ఎన్నో ఎమోషనల్ సన్ని వేషాలలో నటిస్తూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇలా బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వెండితెరపై అవకాశాలను అందుకోవడంతో అభిమానులు సైతం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై వంటలక్క బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు.