పరధ్యానంలో ఉండిపోయిన తులసి సామ్రాట్…. లాస్య బాధలు భరించలేకపోతున్న కుటుంబ సభ్యులు!

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే…సామ్రాట్ తులసికి తెలియకుండా తన తల్లిని అక్కడికి పంపించి తనతో ప్రశాంతంగా పడుకోమని చెప్పి ఇంట్లోకి విజిల్స్ వేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు.అది చూసిన వాళ్ళ బాబాయ్ వీడికి ఏమైంది అని ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా వీడికి పిచ్చి అయినా పట్టి ఉండాలి లేదా ప్రేమలో పడి ఉండాలి ఇంతకీ నీ మనసులోకి వచ్చిన అమ్మాయి ఎవరో చెప్పు అని సామ్రాట్ ని అడుగుతాడు.

నాకు కాదు పిచ్చి పట్టింది నీకు పట్టింది అంటూ సామ్రాట్ తన బాబాయ్ తో మాట్లాడుతూ ఉండగా తన బాబాయ్ మాత్రం సామ్రాట్ ను తన మాటలతో కొంతసేపు ఓ ఆట ఆడుకుంటాడు.మరోవైపు దివ్య కంగారుగా ఆలోచిస్తూ కూర్చుంటుంది. అంతలో అక్కడికి వచ్చిన శృతి అంకిత నీ ముందు టీ పెట్టి చాలా సేపు అయింది. ఆ టీ కూడా తాగనంత పరధ్యానంలో ఉన్నావు అని అనడంతో వెంటనే దివ్య మరొకసారి టి వేడి చేసి తాగుతా అంటుంది.

అందుకు శృతి అంకిత ఇద్దరూ కూడా ఒక సిలిండర్ రెండు నెలలు రావాలి రోజుకు రెండు పాలు ప్యాకెట్లు మాత్రమే, అరకిలో కూరగాయలతో వంట చేయాలి అంటూ లాస్య పెట్టే బాధలను గుర్తు చేసుకుంటారు. ముందు నువ్వెందుకు అలా ఉన్నావో చెప్పు అంటూ శృతి అంకిత ఇద్దరు దివ్యని అడగడంతో కాలేజీలో ఫంక్షన్ ఉందని తన ఫ్రెండ్స్ కి డాన్స్ చేస్తా అని మాట ఇచ్చాను ఇంతకుముందు అయితే అమ్మ ఇక్కడే ఉండి నాకు డాన్స్ నేర్పించేది ఇప్పుడు తను అక్కడ నేను ఇక్కడ ఒకవేళ అక్కడికి వెళ్లానంటే ఎలాంటి గొడవలు జరుగుతాయోనని భయం అంటూ దివ్య కంగారుపడుతుంది.

ఇంతదానికే బాధపడుతున్నావా ఇక్కడ మేము కూడా డాన్సర్ మాకు అవకాశం ఇవ్వాలి కదా అంటూ అంకిత లాస్య అంటారు. అయితే తన ఫ్రెండ్స్ ని కూడా ఇక్కడికే తీసుకువస్తే లాస్య ఆంటీ ఏమంటుందో అని మరోసారి ఆందోళన చెందగా మేము చూసుకుంటామని అంకిత శృతి భరోసా ఇస్తారు. మరోవైపు తులసి ముగ్గు పెడుతూ పరధ్యానంలో ఉండగా తన తల్లి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అనడంతో నా మనసు ఇక్కడ లేదు మన ఊరిలోనే ఉంది అంటూ తులసి ఇంకా ఆ జ్ఞాపకాల నుంచి బయటపడలేదు.అసలు నిన్ను కాదు ఆ సామ్రాట్ ని అనాలి అంటూ సరస్వతి అనడంతో తనని ఏమి అనకు అమ్మ అంటూ తులసి తనని వెనకేసుకొస్తుంది.