స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న ఇంటింటికి వరలక్ష్మి సీరియల్ మంచి ప్రేక్షకు ఆదరణ సొంతం చేసుకుంది. ఇక తాజా ఎపిసోడ్ విషయానికి వస్తే.. సామ్రాట్ సహాయంతో సొంతూరుకు చేరుకున్న తులసి అక్కడ తన చిన్ననాటి జ్ఞాపకాలను ఆనందంగా నెమరు వేసుకుంటూ ఉంటుంది. అక్కడ తను పుట్టిన ఇల్లు చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంట్లోకి వెళ్ళడానికి సామ్రాట్ తాళం పగలగొడతాడు. సామ్రాట్ చేసిన సాయానికి తులసి ఆనందపడుతుంది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి రాజా సినిమాలోని “ఏదో ఒక రాగం” అనే పాట పాడుతుంది. గొంతు విన్న ఒక వ్యక్తి ఆ ఇంటి వద్దకు వచ్చే ఎవరైనా ఉన్నారా అని పిలుస్తాడు. బయటికి వచ్చిన తులసి అతన్ని చూసి చాలా ఆనంద పడుతుంది.
నీకు సంగీతం నేర్పించిన జగన్నాథం మాస్టర్ ని అని ఆ వ్యక్తి అంటాడు. తులసి సామ్రాట్ ని చూపించి తన స్నేహితుడు అని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత మ్యూజిక్ స్కూల్ పెడుతున్నా, దాన్ని మీరే ప్రారంభించాలని తులసి సంగీతం మాష్టారు ని అడుగుతుంది. ఇక మరొకవైపు లాస్య చేసిన పనికి అంకిత లాస్య తో గొడవకు దిగుతుంది. నా పేషెంట్స్ ఫీజు వసూలు చేసే హక్కు నీకు లేదు. పేద వాళ్ళకి ఉచితంగా సేవ చెయ్యాలని నేను చూస్తుంటే నువ్వు ఎందుకు నాకు చెప్పకుండా ఫీజు వసులు చేశావ్ అంటూ సీరియస్ అవుతుంది. దీంతో లాస్య పేషెంట్స్ నీ వాళ్ళే అయినా వాళ్ళు కూర్చుంది నా ఇంట్లో. ఇక్కడ ఉండటానికి మీకు పర్మిషన్ ఇచ్చాను కానీ నీ పేషెంట్స్ కి కాదు. ఇదేమి ధర్మాసుపత్రి కాదు. నీకే రూపాయి దిక్కు లేదు నువ్వు ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం ఏంటి అని అంటుంది.
ఆ సమయంలో నందు అక్కడికి వచ్చి.. ఏంటి విషయం అని అడుగుతాడు. పేదవాళ్ళకి ఉచితంగా సేవ చెయ్యాలని అంకిత అనుకుంటుంది, నువ్వు సెటిల్ అయిన తర్వాత అలా చెయ్యొచ్చు కదా అని చెప్పాను అని లాస్య మాట మార్చి నందుతో చెప్తుంది. దీంతో నందు కూడా లాస్య మాటలు సరైనవే అని ఆమెకు సపోర్ట్ గా మాట్లాడుతాడు. మన పరిస్థితి బాగోలేదు అది ఆలోచించమని అంటాడు. తులసి ఆంటీ ఉన్నప్పుడు కూడా మన పరిస్థితి ఇదే కదా అని అంకిత అనగానే…తులసి ఆంటీ చేసింది తప్పు పట్టడం లేదు కానీ పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి అక్కడినుండి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ పుట్టిన ఇంటికి చేరుకున్న తులసి తన వెతుకుతూ ఉంటుంది. ఇలా ట్రంకు పెట్టె కోసం వెతికి దానిని కష్టపడి కిందకు దించుతుంది. తవ్వకాల్లో లంకె బిందె దొరికినంత ఆనందంగా ఉంది మీ మొహం అని సామ్రాట్ తులసి ని పొగిడేస్తాడు.