ఇంట్లో పరిస్థితులు తెలుసుకొని బాధపడిన తులసి… బెనర్జీతో చేతులు కలిపిన లాస్య!

బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే గుడిలో ప్రసాదం విషయంలో పరంధామయ్య అనసూయ గొడవ పడుతూ ఉండడం చూసిన తులసి షాక్ అవుతుంది. ఇక ఒక దగ్గర పరంధామయ్య అనసూయ ఇద్దరు కూర్చుని వారి కష్టాలను మాట్లాడుకుంటూ ఉంటారు.ఇంట్లో కడుపునిండా భోజనం చేయలేదు. ఇక్కడైనా ఆకలి తీర్చుకుందాం అని ప్రసాదం అడిగానని పరంధామయ్య చెబుతాడు ఇంట్లో రోజురోజుకు లాస్య ఆగడాలు ఎక్కువవుతున్నాయి పాలు లేకుండా డికాషన్ తాగలేకపోతున్నాము అంటూ బాధపడతారు.

ఈ విధంగా లాస్య ఇంట్లో వారిని పెట్టే టార్చర్ గురించి అనసూయ పరందామయ్య మాట్లాడుకుంటూ ఉండగా సామ్రాట్ తులసి ఆ మాటలు విని బాధపడతారు ఈ విషయాలు తులసికి చెబుదాము అంటే నా నోరు నొక్కేస్తున్నారు అంటూ అనసూయ మాట్లాడే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు బెనర్జీ లాస్యకు ఫోన్ చేసి తనకు ప్రాజెక్ట్ అవకాశాన్ని కల్పించానని చెప్పడంతో లాస్య సంతోషపడుతుంది తన ఆఫీసు అడ్రస్ పంపించి తనని కలవమని బెనర్జీ చెబుతాడు. ఇక లాస్య వెళుతుండగా నన్ను ఎక్కడికని అడగడంతో వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదనీ తెలియదా అంటూ లాస్య అబద్ధాలు చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది.

మరోవైపు సామ్రాట్ మీ అత్తయ్య మామయ్య అంత ఇబ్బంది పడుతుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు. నేను కనుక మీ స్థానంలో ఉంటే ఈపాటికి వారిని నా ఇంట్లో తెచ్చిపెట్టుకునే దాన్ని ఎందుకు ఇలా ఉన్నారు అని సామ్రాట్ అడగడంతో కుటుంబాన్ని వేరు చేయడం చాలా సులభం కానీ అందరిని కలిపి ఒకచోట ఉంచడం కష్టమని తులసి చెబుతుంది. బహుశా లాస్య చేసే ఆగడాలని నందగోపాల్ గారికి తెలియవనుకుంటా అని తులసి మాట్లాడుతుంది.

మరోవైపు లాస్య బెనర్జీని కలవడంతో బెనర్జీ లాస్య గురించి పొగుడుతూ ఉంటాడు. అదే సమయంలోనే ఈ ప్రాజెక్టు గురించి పూర్తిగా డీల్ మాట్లాడుకొని నువ్వు ఆశించిన దానికన్నా ఎక్కువ ఆఫర్ చేస్తున్నాను అని బెనర్జీ ఈ అవకాశాన్ని లాస్యకు ఇస్తాడు. మరోవైపు తులసి నందగోపాల్ ఇంటికి వెళ్తూ ఇంటికి కావలసిన సరుకులు అన్ని తీసుకువెళ్తుంది.తులసి రావడంతో అందరూ సంతోషపడతారు అయితే తాను సరుకులు తీసుకురావడంతో లాస్య ఎవరు ఇవన్నీ తీసుకువచ్చారు అనడంతో తులసి నేనే నా సొంత డబ్బులతో తీసుకువచ్చాను. నా కుటుంబం ఆకలితో ఉండకూడదని తీసుకు వచ్చాను అని చెబుతుంది.

ఇంటికి ఏమి సరుకులు కావాలో ఎప్పుడు ఏం చేయాలో అన్ని ప్లాన్స్ మాకు ఉన్నాయి. ఇక్కడ సరుకులు తీసుకురావడానికి నువ్వు ఎవరు అంటూ లాస్య మాట్లాడుతుంది.ఇక నందగోపాల్ కూడా తులసిని అపార్థం చేసుకుంటారు. అయితే నాకు ఒక కప్పు కాఫీ కావాలి అని అడగడంతో లాస్య నేను వెళ్లి తీసుకు వస్తానని చెబుతుంది దాంతో నందు నువ్వు కాదు అంకిత నువ్వు వెళ్లి కాఫీ తీసుకురా అని నందు చెప్పగా నేను కాదు శృతి ఎవరు వెళ్లిన ఖాళీ చేతులతో వెనక్కి రావాల్సిందే అని చెబుతుంది.ఎందుకు అని నందు అడగడంతో లాస్య ఆంటీ ఫ్రిడ్జ్ మాత్రమే కాకుండా కిచెన్ లో ఉన్న ర్యాక్స్ అన్నింటికీ తాళాలు వేసుకొని తన వద్ద పెట్టుకుందని చెప్పడంతో నందు షాక్ అవుతాడు.