సుధీర్ జబర్దస్త్‌ను వీడటానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన రామ్ ప్రసాద్?

గత కొన్ని రోజులుగా జబర్దస్త్ కామెడీ షో నుండి ఎంతోమంది కమెడియన్లు బయటకు వెళ్ళిపోతున్నారు. అలా జబర్దస్త్ కి దూరమైన వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన సుధీర్ ఇలా ఈ షోకి దూరం కావటానికి కారణమేంటి అంటూ చాలా అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఈ విషయం గురించి హైపర్ ఆది ఒక హింట్ ఇచ్చాడు. జబర్దస్త్ షో గురించి కిర్రాక్ ఆర్పి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హైపర్ ఆది, రాంప్రసాద్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్పీ చెప్పినవి అన్ని అబద్ధాలే అంటూ కొట్టి పారేశారు.

ఈ సందర్భంగా అది మాట్లాడుతూ… ఒక గొప్ప సంస్థ గురించి, ఒక గొప్ప వ్యక్తి గురించి ఆర్పీ ఎందుకు ఇలా మాట్లాడాడో అర్థం కావడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో కమెడియన్లుగా కొనసాగుతున్న ఎంతోమందికి జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది అంటే రాంప్రసాద్ వెల్లడించాడు. జబర్దస్త్ లో పనిచేస్తున్న ఎంతోమందికి శ్యాం ప్రసాద్ రెడ్డి లక్షల రూపాయలు సహాయం చేశాడు. రష్మీ ఇల్లు కట్టుకోవడానికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అప్పు ఇప్పించాడు. పంచ్ ప్రసాద్ కి రోజూ పని కల్పిస్తూ నెలకిమూడున్నర లక్షలు సంపాదించే మార్గం కల్పించాడు. ఇలా ఎంతో మందికి శ్యాం ప్రసాద్ రెడ్డి సహాయం చేశారు అంటూ ఆది చెప్పుకొచ్చాడు.

ఇక సుధీర్ కూడా జబర్దస్త్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు. సుధీర్, రష్మి కి పర్సనల్ లైఫ్ లేకుండా చేశారు అని ఆర్పీ చెప్పిన మాటలకు సమాధానంగా.. వారిద్దరి లవ్ ట్రాక్ వాళ్ళే వాళ్ళు ఫేమస్ అయ్యారు. ఈ విషయంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు అని వెల్లడించారు. ఇక సుధీర్ జబర్దస్త్ నుండి బయటికి రావటానికి గల కారణం ఏంటి అని యాంకర్ అడగగా.. ప్రస్తుతం సుధీర్ కు వేరే ఛానల్ నుంచి ఫైనాన్షియల్ గా మంచి ఆఫర్ వచ్చింది. అందుకే సుధీర్ మల్లెమాల వారితో అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వేరే ఛానల్ కి వెళ్ళాడు. ఎందుకంటే మల్లెమాల వారితో ఒకసారి అగ్రిమెంట్ చేసుకుంటే వేరే ఛానల్ కి వెళ్ళే అవకాశం ఉండదు. అందువల్ల సుధీర్ జబర్దస్త్ కి దూరమయ్యాడు అంటూ రామ్ ప్రసాద్ వెల్లడించాడు.