నేను మాట్లాడకపోయినా కూడా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు.. విష్ణు ప్రియ పోస్ట్ వైరల్!

Anchor vishnu priya sensetional comments on bigg boss

బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమైన పోవే పోరా అనే షోలో సుధీర్ తో కలిసి యాంకర్ గా వ్యవహరించిన విష్ణు ప్రియ ఆ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఆ షో తర్వాత బుల్లితెరపై మళ్లీ అవకాశాలు రాకపోవడంతో సినిమాల వైపు తన దృష్టి మళ్లించింది. ఎంతో కాలం కష్టపడ్డ తర్వాత ఇటీవల రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన ‘వాంటెడ్ పండుగాడు’ అనే సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

ఇలా సినిమాలు టీవీ షోలో లేకపోయినా కూడా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్, డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా నెట్టింట ఈ అమ్మడి అందాల ఆరబోత కూడా మామూలుగా ఉండదు. ఇక ఇటీవల బిగ్ బాస్ విన్నర్ మానస్ తో కలిసి జరీ జరి పంచకట్టు అనే ప్రైవేట్ ఆల్బమ్ లో తన అందాలు ఆరబోస్తూ వేసిన మాస్ స్టెప్పులకి సోషల్ మీడియా షేక్ అయింది .

ఇలా విష్ణుప్రియ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ క్షణాలలోనే వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా స్నేహితులను ఉద్దేశించి విష్ణు ప్రియ షేర్ చేసిన పోస్ట్ కూడా వైరల్ అయింది. కొందరు మన మాటలను అర్థం చేసుకోలేరు. కానీ కొందరు మాత్రం మనం మాట్లాడకపోయినా కూడా అర్థం చేసుకుంటారు అని ఓ కొటేషన్ ని షేర్ చేస్తూ..” నా చుట్టూ అందరూ అలాంటి వారే ఉన్నారు.. నేను మాట్లాడకపోయినా నన్ను అర్థం చేసుకుంటారు. నన్ను .. నా పిచ్చిని, మంచిని, తిక్కని అన్నీ భరిస్తుంటారు.. అని తన ఫ్రెండ్స్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.