టెలివిజన్ లో ప్రసారమైన అతిపెద్ద రియారిటీ షో బిగ్ బాస్ రియాల్టీ షో. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో అన్ని భాషలలో ప్రసారం అవుతూ మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలో తెలుగులో కూడా ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో తొందరలోనే ఆరవ సీజన్ ప్రారంభం కానుంది. గడిచిన 5 సీజన్లు మంచి రేటింగ్స్ తో పాటు మంచి ప్రేక్షకాదరణ కూడా సొంతం చేసుకున్నాయి. దీంతో బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పుడు ప్రసారమవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రేక్షకుల ఎదురుచూపులు తొందర్లోనే ఫలించబోతున్నాయి. సెప్టెంబర్ 4వ తేదీన బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానున్నట్లు నాగార్జున అధికారికంగా ప్రకటించాడు.
అయితే ప్రస్తుతం ఈ సీజన్ సిక్స్ లో పాల్గొని కంటెస్టెంట్ల వివరాల గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించనున్నారు. ఈ సీజన్లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొననున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సీజన్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్ లిస్ట్ గురించి చర్చలూ జరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే కొంతమంది పేర్లు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో పలువురు చైల్డ్ ఆర్టిస్టులు కూడా పాల్గొనన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఎప్పటిలాగే ఈ సీజన్లో సింగర్లతో పాటు యాంకర్లు కూడా పాల్గొంటున్నారు.
ప్రముఖ సింగర్ రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొంటున్నాడని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక యాంకర్ పద్మిని, ఉదయభాను, మంజుష వంటి వారు బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తొంది. అయితే చివరి నిమిషంలో ఉదయభాను బిగ్ బాస్ ఆఫర్ ని తిరస్కరించినట్లు సమాచారం. అంతే కాకుండా యాంకర్ దీపిక పిల్లి కూడా చివరి నిమిషంలో బిగ్ బాస్ కి నో చెప్పినట్టు తెలుస్తొంది. ఇక ఈ సీజన్ 6 లో యూట్యూబర్ ఆది రెడ్డీ, చలాకి చంటి, జబర్ధస్త్ ఫైమా, ట్రాన్స్ జెండర్ తమ్మయి, సింగింగ్ పెయిర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి ఇలా మొత్తం 21 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ సీజన్ 6 లో కనిపించబోతున్నారని తెలుస్తొంది. అయితే ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరొక మూడు రోజులు వేచి చూడాల్సిందే.