పెళ్లి పేరుతో సుధీర్ ని ఒక ఆట ఆడుకున్న అమ్మాయిలు.. పాపం సుధీర్!

సుడిగాలి సుధీర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెజీషియన్ గా తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ తర్వాత జబర్దస్త్ లో అవకాశం దక్కించుకొని కమెడియన్ గా మంచి గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో తన కామెడీ టైమింగ్, పంచులతో పాటు రష్మితో ఉన్న లవ్ ట్రాక్ వల్ల కూడా సుధీర్, బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పటికీ సుధీర్ రష్మీ ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ఉంటుంది. ఇటీవల సుధీర్ జబర్దస్త్ కి స్వస్తి చెప్పి మాటీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ అనే షో లో అనసూయ తో కలసి యాంకర్ గా సందడి చేస్తున్నాడు.

అయితే జబర్థస్త్ నుండి బయటికీ వెళ్లినా కూడా సుధీర్,రష్మి లవ్ మేటర్ ఎప్పుడూ వైరల్ గా మారుతుంది. ఇక సుధీర్ ని అందరూ ప్లే బాయ్ అని అంటుంటారు. సింగింగ్ షో లో కూడా సుధీర్ మీద అందరూ పంచులు వేస్తూ ఉంటారు. ఇక ఇటీవల జరిగిన సుపర్ సింగర్ జూనియర్స్ ఎపిసోడ్ లో ఇద్దరు అమ్మాయిల వల్ల సుధీర్ చాలా ఇబ్బంది పడ్డాడు. తనని ప్రేమించి మోసం చేసి పెళ్ళి చేసుకోకుండా తప్పించుకుంటున్నాడు అంటూ ఒక అమ్మాయి రచ్చ చేయగా.. మరొక అమ్మాయి అన్నయ్య అంటూ సుధీర్ వెంట పడి తనకు పెళ్లి చేయమని గోల చేసింది.

ఇలా ఒక అమ్మాయి పెళ్ళి చేసుకో అని సుధీర్ వెంట పడుతుంటే మరొక అమ్మాయి తనకి పెళ్లి చెయ్యి అన్నయ్య అంటూ సుధీర్ వెంట పడింది. ఇల్ ఇద్దరు అమ్మాయిల మద్య సుధీర్ నలిగిపోయాడు. పెళ్ళి చేసుకోమని వెంట పడుతున్న అమ్మాయి నుండి తప్పించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. తానింక చిన్న పిల్లాడినని, తన పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని తంటాలు పడి ఆ అమ్మాయిని వదిలించుకోవటానికి సుధీర్ చేసిన ప్రయత్నాలు అందరికీ నవ్వు తెప్పించాయి. దీంతో సుధీర్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ సందడిగా ఉంటుందని మరొకసారి రుజువు అయ్యింది.