మూడో వారం కెప్టెన్ గా విజయం సాధించిన కామన్ మ్యాన్.. భార్యను తలుచుకొని ఎమోషనల్!

బిగ్ బాస్ కార్యక్రమం ఆరవ సీజన్ ప్రస్తుతం ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మూడవ వారం మరో రోజులో పూర్తికానుంది. ఈ క్రమంలోనే మూడవ వారానికి కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఎన్నో టాస్క్ లను నిర్వహించారు.ఈ టాస్కులలో భాగంగా చివరికి కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి కెప్టెన్ గా నిలిచారు. మూడవ వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా సత్య శ్రీ, ఆదిరెడ్డి, శ్రీహాన్ పోటీ దారులుగా నిలిచారు.

అయితే బిగ్ బాస్ ఈ ముగ్గురికి పెద్ద తొట్టెలను ఇచ్చి ఎవరైతే ముందు ఈ తొట్టెలో ఇసుకను నింపుతారో వాళ్లే కెప్టెన్సీ టాస్కులో విజయం సాధించినట్లు అని తెలియజేశారు. అయితే ఈ ముగ్గురు పెద్ద ఎత్తున పోటీ పడగా చివరికి ఈ పోటీలో ఆదిరెడ్డి గెలిచారు.ఆదిరెడ్డి ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో ఆయనకు ఈ టాస్క్ ఎంతో సులభతరం అయింది. దీంతో ఈ టాస్కులు గెలిచినటువంటి ఆదిరెడ్డి కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నారు.

ఇలా ఒక సాధారణ కుటుంబం నుంచి బిగ్ బాస్ వరకు వచ్చినటువంటి ఈయన మూడవ వారంలోనే కెప్టెన్ గా గెలవడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ లవ్ యు కవిత..మీ సపోర్ట్ వల్లే ఇక్కడి వరకు వచ్చాను నువ్వు హ్యాపీ నా అంటూ తన భార్యను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఇక కెప్టెన్ గా గెలిచిన తాను ముందు ముందు ఇంకా చాలా ఉంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈయన నమ్మకం చూస్తుంటే తప్పకుండా టాప్ 5 లో ఒకరిగా నిలుస్తారని సందేహం అందరిలోనూ నెలకొంది.