బిగ్ బాస్ లో కెప్టెన్సీ టాస్క్ వివాదం.. దారుణంగా పడిపోయిన రేటింగ్స్…!

ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో కూడా ప్రసారమవుతే ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల ప్రారంభమైన ఆరవ సీజన్ ఇప్పటికే ఆరు వారాలు పూర్తిచేసుకుని ఏడవ వారంలో కొనసాగుతోంది. ఇక ఈ ఏడవ వారంలో ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రాసెస్ కూడా పూర్తి అయింది. ఇక ఏడవ వారంలో కెప్టెన్సీ పదవి కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్లకు టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో భాగంగా ఒక్కో సినిమాలోని ఒక్కో పాత్రను కంటెస్టెంట్ కి ఇచ్చి టాస్క్ ముగిసే వరకు అదే పాత్రలో ఉండాలని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు సూచించాడు.

అయితే కంటెస్టెంట్లు మాత్రం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని సీరియస్ గా తీసుకోలేదు. టాస్క్ పూర్తీ కాకముందే రేవంత్, అర్జున్ కళ్యాణ్ వారి పాత్రల నుండి బయటకి వచ్చి ఒకరితో ఒకరు గొడవపడ్డారు. ఇది గమనించిన బిగ్ బాస్ 7వ వారంలో కెప్టెన్సీ టాస్క్ని రద్దుచేసి ఈవారం కెప్టెన్సీ పదవీ లేదని ఇంటి సభ్యులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే గడిచిన ఐదు సీజన్లతో పోలిస్తే ఆరవ సీజన్ లోనే బిగ్ బాస్ ఎక్కువగా కల్పించుకొని ఇంటి సభ్యులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఇంటి సభ్యుల పర్ఫామెన్స్ సరిగా లేకపోవటంతో బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి రేటింగ్ అంతంత మాత్రమే ఉంది . ఇక కంటెస్టెంట్ లందరూ తరచూ ఎలా గేమ్ మీద శ్రద్ధ పెట్టకుండా ఒకరితో ఒకరు వాదలాడుకోవడంతో ప్రేక్షకులకు షో మీద ఆసక్తి పూర్తిగా తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఏడవ వారంలో కెప్టెన్సీ పదవీ కోసం ఇచ్చిన టాస్క్ లో కంటెస్టెంట్ల పెర్ఫార్మన్స్ సరిగా లేకపోవటంతో బిగ్ బాస్ తో పాటు ప్రేక్షకులకు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ రేటింగ్స్ మరింత పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన 5 సీజన్లతో పోలిస్తే 6వ సీజన్ అత్యంత తక్కువ రేటింగ్ నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.