ఆంటీ అంటూ యాంకర్ శ్యామల పరువు తీసిన నటుడు.. శ్యామల కౌంటర్ మామూలుగా లేదుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట బుల్లితెర నటిగా సీరియల్స్ లో నటిస్తూ తన కెరీర్ ప్రారంభించిన శ్యామల ఆ తర్వాత యాంకర్ గా మారి ఎన్నో టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక ప్రస్తుతం శ్యామల టీవీ షోలో కనిపించకపోయినా కూడా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన “తగ్గేదేలే” అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్యామల యాంకర్ గా వ్యవహరించింది.

ఇక ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నటుడు రాజా రవీంద్ర కూడా హాజరయ్యాడు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజా రవీంద్ర మాట్లాడుతూ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ తర్వాత చివరిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చివరికి శ్యామల ఆంటీకి కూడా థాంక్స్ అంటూ అందరి ముందు ఆమె పరువు తీసాడు. అయితే ఇలా అందరి ముందు ఆంటీ అని పిలిచినందుకు శ్యామల ఏమాత్రం బాధపడకుండా రివర్స్ పంచ్ వేసి అందరికీ షాక్ ఇచ్చింది. శ్యామల ఆంటీకి థాంక్స్ అని రాజా రవీంద్ర అనగానే నేను ఆంటీ అయితే మీరు తాత అవుతారు అంటూ రాజా రవీంద్ర పై రివర్స్ పంచ్ వేసింది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆంటీ అనే పదం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. దీనికి కారణం అనసూయ. ఇటీవల ఆంటీ అని పిలిచిన వారి మీద కేసులు పెడతానని అనసూయ రెచ్చిపోవడంతో ఈ ఆంటీ అనే పదం పెద్ద వివాదంగా మారింది. ఈ క్రమంలో రాజా రవీంద్ర కూడా శ్యామలని ఆంటీ అని పిలవగా శ్యామల మాత్రం చాలా స్ఫూర్తిగా తీసుకొని ఏమాత్రం కోపగించుకోకుండా రివర్స్ పంచ్ వేసి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.