కూతుర్లు గురించి చెబుతూ.. అందరిముందు కంటతడి పెట్టుకున్నారు కార్తీక దీపం భాగ్యం?

బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ లో నటిస్తూ ఎంతోమంది నటీనటులు సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ క్రమంలో మాటీవీలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లోని నటీనటులు కూడా మంచి గుర్తింపు పొందారు. కార్తీకదీపం సీరియల్ లో అర్థ పావు భాగ్యం పాత్రలో నటించి ప్రేక్షకులను నవ్వించిన ఉమాదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీకదీపం సీరియల్ కి ముందు కొన్ని సీరియల్స్ సినిమాలలో నటించిన కూడా ఉమాదేవికి సరైన గుర్తింపు లభించలేదు . కానీ కార్తీకదీపం సీరియల్ లో అర్థ పావు భాగ్యం పాత్రలో నటించిన ఉమాదేవి ఆ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందింది.

ఇలా కార్తీకదీపం సీరియల్ వల్ల వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉమాదేవి ప్రవర్తన చూసి ప్రేక్షకులతో పాటు బిగ్ బాస్ యాజమాన్యం వారు కూడా షాక్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో ఉమాదేవి అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తూ బూతులు మాట్లాడటంతో ప్రేక్షకుల నుండి నెగెటివిటీ మూట కట్టుకుంది. ఈ క్రమంలో నాగార్జున కూడా ఉమాదేవి పై సీరియస్ అయ్యాడు. అందరు బిగ్ బాస్ షో కి బాగా పాపులర్ అవుతుంటే ఉమాదేవి మాత్రం బిగ్ బాస్ షో కి వెళ్లి తన ప్రవర్తనతో ఉన్న పాపులారిటీ కొంచెం తగ్గించుకొని బయటికి వచ్చింది.

ఇక బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఉమాదేవికి కార్తీకదీపం సీరియల్ నుండి తొలగించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆమెకు సీరియల్స్ లో అవకాశాలు లేకుండా పోయాయి. కానీ అప్పుడప్పుడు టెలివిజన్ లో ప్రసారం అవుతున్న టీవీ షోలో పాల్గొంటూ సందడి చేస్తోంది. ఈ క్రమంలో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సందడి చేసింది. ఇక ఈ షోలో ఉమాదేవి తన కూతుర్ల గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయింది. పెద్ద కూతురిని పరిచయం చేస్తూ తను నన్ను తల్లిలా చూసుకుంటుందని చెప్పుకొచ్చింది. ఇక తన చిన్న కూతురు మెచ్యూర్ ఫంక్షన్ లో కూడా సొంతవాళ్లు లేకపోయినా హరిత జాకీ దంపతులు సొంత అన్నా వదినలా వచ్చి అన్ని పనులు దగ్గరుండి చేశారని చెప్పుకొచ్చింది.