బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా శ్రీ సత్య పేరెంట్స్.. ఎమోషనల్ అయిన శ్రీ సత్య!

బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం 12వ వారం కొనసాగడంతో హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ని లోపలికి పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిరెడ్డి రాజ్ ఫ్యామిలీ ఇది వరకే బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. ఇకపోతే తాజాగా వదిలిన ప్రోమోలో భాగంగా ఫైమా తల్లి హౌస్ లోకి ఎంటర్ ఇవ్వడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్లు అందరితో కలిసి సరదాగా గడిపారు. ఇక ఫైమా కాకుండా ఏ ప్లేయర్ అంటే మీకు ఇష్టం అని అడగడంతో అందరూ బాగా ఆడుతున్నారని
ఫైమా తల్లి చెప్పగా వెంటనే శ్రీహన్ మాకన్నా బాగా మీరు ఆడుతున్నారంటూ సెటైర్ వేశారు.

ఇక ఫైమా తల్లి రేవంత్ ని చూపిస్తూ మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది అంటూ షాక్ ఇచ్చారు. ఈ విధంగా ఫైమా తన తల్లితో ఎంతో సంతోషంగా గడపగా శ్రీ సత్య ఎమోషనల్ అవుతూ మా అమ్మ కూడా నడుస్తూ ఉంటే బాగుండేది అని ఎమోషనల్ అవుతున్న సమయంలో తన పేరెంట్స్ వచ్చారని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ తన తల్లిని హగ్ చేసుకుని తనకు అన్నం తినిపిస్తూ తన ప్రేమను తెలియజేశారు.

ఈ విధంగా తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా శ్రీ సత్య, ఫైమా పేరెంట్స్ రావడంతో హౌస్ లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది.ఇక కీర్తి పేరెంట్స్ ఇద్దరు కూడా యాక్సిడెంట్లో చనిపోవడంతో తనకోసం ఎవరూ వస్తారు అంటూ అభిమానులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా రేవంత్ భార్య అన్విత కూడా హౌస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదివరకే రేవంత్ ను మిస్ అవుతున్నట్లు అన్విత సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేయడంతో ఈమెను బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారేమోనని పలువురు భావిస్తున్నారు.